నీ ఐఫోన్ నేనే తయారు చేశా.. జాగ్రత్త! | Foxconn chairman terry Gou warns Donald Trump.

Foxconn chairman open letter to trump

Foxconn chairman Terry Gou, Donald Trump Teery Gou, i Phone Donald Trump, China i Phone manufacturing, China i Phone Donald Trump, Donald Trump warn Apple Phone, Terry Gou, Apple's iPhone Donald Trump

Apple's iPhone Manufacturing Probably Won't Leave China for the U.S., but Other Products Might.

అయ్యా ట్రంప్... నీ ఫోన్ నేనే తయారు చేశా!

Posted: 12/08/2016 10:51 AM IST
Foxconn chairman open letter to trump

అగ్రరాజ్యం అధ్యక్షుడిగా గెలిచి నెల రోజులు కావస్తున్నా.. అక్కడి ప్రజల్లో మాత్రం ట్రంప్ పై వ్యతిరేకత ఏ మాత్రం తగ్గటం లేదు. ప్రచారంలో తీవ్ర విమర్శలతో విరుచుకుపడిన ఆయనగారు కూడా ఈ మధ్యలో అడపా దడపా నోటి దురుసును చూపిస్తూనే ఉన్నాడు. మొన్న ట్విట్టర్ వేదికగా చైనాను తిట్టి పోస్తే.. బదులుగా డ్రాగన్ కంట్రీ ఘాటైన సమాధానమే ఇచ్చింది. ఇక మొదటి నుంచి యాపిల్ వ్యవహారంపై నెగటివ్ కామెంట్లు చేస్తూ వస్తున్న ట్రంప్, చైనా కంపెనీలను బహిష్కరిస్తూ యాపిల్ పరిశ్రమలను అమెరికాలోనే స్థాపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో తైవాన్ బిజినెస్ టైకూన్, ఐ ఫోన్ విడిభాగాలను తయారుచేసే ఫాక్స్‌కాన్ కంపెనీ అధిపతి టెర్రీ గౌ ఓ లేఖలో ట్రంప్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

డియర్ ట్రంప్, నేను ఎవరో నీకు తెలీక పోవచ్చు. కానీ, నువ్వు వాడే ఐ ఫోన్ తయారు చేసింది నేనే. నా పేరు టెర్రీ గౌ. ముందుగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నీకు నా శుభాకాంక్షలు. వచ్చే సారికి బహుశా నీకు లేఖ రాసింది తైవాన్ అధ్యక్షుడు అని తెలిసి వస్తుంది(ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో గౌ ఉన్నాడు). ఇక లేఖ విషయానికొస్తే... ‘‘నీకు నాకు చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరం బిలినీయర్లమే. ఇద్దరం యుక్తవయసులో ఉన్న అందమైన అమ్మాయిలనే పెళ్లి చేసుకున్నాం. ఇద్దరికీ వాల్ స్ట్రీట్ అంటే అసహ్యామే. అయితే ఈ మధ్య వ్యవహారం ఏం బాగోటం లేదు. నీ నియోజకవర్గాల్లో కొత్త ఉద్యోగాలను స్థాపిస్తామనే ప్రకటన చేశావ్. ముందు నువ్వు వాళ్ల మెప్పును పొందు.

ఇండియా, ఇండోనేషియా లాంటి దేశాల్లో నా పనితనం నువ్వు రిఫరెన్స్ గా తీసుకో. మీడియాపై పిచ్చి ప్రేలాపనలు మానుకో. విదేశాల నుంచి ఉద్యోగాల కోసం వచ్చేవారని వెల్లగొట్టాలని, అసలు ఆయా కంపెనీలకు ఇక్కడ అవకాశం ఇవ్వొద్దంటూ వ్యాఖ్యలు చేస్తున్నావ్. అది సరైంది కాదు. నేను ఇతర దేశాల్లో స్థాపించిన కంపెనీలు నాకు విపరీతమైన లాభాలను తెచ్చిపెట్టాయి. అలాగని ఎవరూ నాకు అభ్యంతరం చెప్పలేదు. నువ్వు ఆపినా అమెరికాలో నా కొత్త ఉత్పత్తుల కంపెనీని స్థాపించి తీరుతాను. టిమ్ కుక్ యాపిల్ పితామహుడు అయినప్పటికీ అతనికి ఐఫోన్ ఎలా తయారు చేయాలో తెలీదు. కానీ, నాకు తెలుసు...

బ్రెజిల్ లో నేను స్థాపించిన సంస్థనే తీసుకుందాం. నువ్వు ఆరోపిస్తున్నట్లు అందులో స్థానికేతరులు ఎక్కువగా లేరు. అంతా స్థానికులే ఉన్నారు. ఆ విషయం నువ్వు స్వయంగా వెళ్లి చూడొచ్చు. నా ఉత్పత్తులు కూడా చాలా తక్కువ ఖరీదులోనే లభిస్థాయి. ఉదాహరణకు చైనాలో కంపెనీలు ఎక్కువగా పెట్టాను. అందుకే అక్కడ తక్కువ ధరకే అమ్ముకుంటున్నాను. దాని వల్ల నీకు, నీ సొంత దేశానికి వచ్చిన నష్టమేం లేదు. మొండిగా వెళ్లి ఐఫోన్ స్వంత సంస్థలను అమెరికాలో స్థాపించాలన్న ప్రయత్నం చేస్తే తర్వాతి పరిణామాలకు నేను బాధ్యుడిని కాదు అంటూ అందులో హెచ్చరించాడు. 

గతంలో కాలిఫోర్నియాలో గత సంవత్సరం కాల్పులు జరిపిన ఉగ్రవాది ఐ ఫోన్ ను యాపిల్ సంస్థ అన్ లాక్ చేయాలని, అలా చేసేవరకు యాపిల్ ఉత్పత్తులను బహిష్కరించాలంటూ పిలుపు నివ్వటమే కాదు. అవసరమైతే తాను ఐఫోన్ ను వాడబోనని ట్రంప్ చైనాపై తన అక్కసును ఇండైరక్ట్ గా వెల్లగక్కాడు. ఈ క్రమంలో తాజా పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Terry Gou  Apple's iPhone  Foxconn chairman  America President  Donald Trump  

Other Articles