రాజాజీ హాల్ లో జయలలితకు అభిమానుల అశ్రునివాళి public to pay last respects to jayalalithaa's at rajaji hall

Public to pay last respects to jayalalithaa s at rajaji hall

Jayalalithaa, last rites, merina beach, poes garden, rajaji hall, chennai, Tamil Nadu, jayalalithaa death, jayalalithaa death news, jayalalithaa, jayalalithaa dead, jayalalithaa dies, jayalalithaa health, actress jayalalithaa, j jayalalithaa, tamil nadu chief minister, k karunanidhi, amma, amma death, aiadmk, aiadmk jayalalithaa, jayalalithaa news, tamil nadu news

Jayalalithaa's body taken to her Poes Garden residence before being taken to Rajaji Hall in Chennai in the early hours.

ప్రజల సందర్భనార్థం రాజాజీ హాల్ కు జయలలిత పార్థీవదేహం

Posted: 12/06/2016 03:06 AM IST
Public to pay last respects to jayalalithaa s at rajaji hall

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆకస్మికంగా అనంతవాయువులలో ఐక్యం కావడంతో అభిమానులు కుంగిపోయారు. అమ్మను కడసారి చూడాలని అర్థరాత్రి అవుతున్నా అభిమానులు అస్పత్రి నుంచి వెళ్లేందుకు నిరాకరించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పన్నీరు సెల్వం తన క్యాబినెట్, ఎమ్మెల్యేలతో పాటు సరాసరి అపోలో అస్పత్రికి వచ్చి అమ్మకు నివాళులర్పించారు. ఆ తరువాత అమ్మ పార్థీవదేహాన్ని కాన్వాయ్ తో పాటుగా అమె నివాసం పోయిస్ గార్డెన్ కు తరలించారు.

పదవీకాలంలో జయలలిత వినియోగించిన కాన్వాయ్‌ వెంటరాగా.. ప్రత్యేక అంబులెన్స్‌లో జయ పార్థివదేహాన్ని మొదట ఆమె అధికార నివాసం పోయెస్‌ గార్డెన్‌కు తరలించారు. ఆ తరువాత తెల్లవారు జామున అక్కడి నుంచి ప్రజల సందర్శనార్థం రాజాజీ హాల్ కు తరలించనున్నారు. పురచ్చి తలైవి వారసుడిగా తమిళనాడు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన పన్నీర్‌ సెల్వం, ఇతర మంత్రులు, ఏఐడీఎంకే పార్టీ ముఖ్యనేతలు ఆ కాన్వాయ్‌ ని అనుసరించనున్నారు. జయ పార్థివదేహం పక్కనే ఆమె స్నేహితురాలు శశికళ ఉండనున్నారు.

అమ్మ పార్థీవదేహాన్ని పాయిస్ గార్డెన్ కు తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న అభిమానులు అర్థరాత్రి మూడు గంటలు అవుతున్నా.. అంబులెన్స్ కాన్వాయ్ చేరిన నిమిషాల వ్యవధిలోనే పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తమను లోనికి అనుమతించాలని పోలీసులతో వాగ్వాధానికి కూడా దిగారు, కాగా అమ్మ పార్థీవ దేహాన్ని ప్రజల సందర్శనార్థం రాజాజీ హల్ లో అధికారులు వుంచనున్నామని అధికారులు ప్రకటించారు.

రాజాజీ హాల్ కు తరలిరానున్న ప్రముఖులు

చెన్నైలోని ప్రముఖ రాజాజీ హాల్ లో అమ్మ పార్థీవ దేహాన్ని వుంచనున్నారు. ఇవాళ అంతా ఇక్కడే ఉంచిన తరువాత రేపు జయలలిత బౌతికకాయానికి అదికార లాంచనాల మధ్య అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. జయలలిత పార్థీవదేహానికి నివాళులు అర్పించేందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశంలోని ఇతర పార్టీల నాయకులు రానున్నారని సమాచారం.

వీరితో పాటు అమెను అభిమానించి, అరాధించే అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రజలు కూడా అమ్మ కడసారి చూపుకోసం.. రాజాజీ హాలుకు చేరుకుని నివాళులు అర్పించనున్నారు. అమ్మతో సంబంధం పెనవేసుకన్న తమిళ చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు, నటులు, నటీమణులు, సిర్మాతలు, దర్శకులు, కూడా అమ్మను కడసారి ఘననివాళులు అర్పించనున్నారు. ఇక ఇటు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు కూడా అమ్మను పార్థీవదేహాన్ని దర్శించుకోనున్నారు. ఈ మేరకు చెన్నై నగరంలో భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు. ఇదిలా వుండగా, ఇవాళ్టి నుంచి తమిళనాట అమ్మ సంతాప దినాలు ప్రారంభమయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayalalithaa  last rites  last respects  merina beach  poes garden  rajaji hall  chennai  Tamil Nadu  

Other Articles