కటకటాల వెనక్కు.. ప్రధానిని మొప్పించిన యువ ఇంజనీరు.. Make In India awardee arrested with fake Rs 2000 notes

Make in india awardee arrested with fake rs 2000 notes

demonetisation, Rs 2000 not, fake currency, make in india, Rs 2000 miuse, Abhinav verma, PM Modi, Arun Jaitley, Vishakha Verma, Suman Nagpal

A young engineer who won the Make in India award and earned a special mention by PM Modi was arrested with fake Rs 2,000 notes which he was printing to dupe those looking to exchange demonetised currency.

కటకటాల వెనక్కు.. ప్రధానిని మొప్పించిన యువ ఇంజనీరు..

Posted: 12/03/2016 02:57 PM IST
Make in india awardee arrested with fake rs 2000 notes

ఆ యువ ఇంజనీరు ప్రధాన మంత్రి నరేంద్రమోడీని మొప్పించగలిగాడు. కానీ పోలీసులను మాత్రం మెప్పించలేకపోయాడు. అదేంటి ప్రధానితో ప్రశంసలందుకున్నవాడు.. పోలీసులను ఎలా మెప్పించలేకపోయాడు..? అంటూ విస్మయానికి గురికాకండి. ప్రధాని మోడీని గత ఏడాది జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో తన అవిష్కరణతో మెప్పించాడు. అందులు వాడే చేతి కర్రలో సెన్సార్లతో వారి మార్గంలో ముందు వచ్చే గోతులు రాళ్లు ఏవైనా వస్తే.. అ సెన్సార్ల ప్రభావంతో అవి అలారమ్ మోగ్రిస్తాయి. దీంతో వెంటనే వారు అలర్గ్ అవుతారు. ఇలాంటి అవిష్కరణతో ఆ యువ ఇంజనీరు ప్రధానిని మొప్పించి.. ప్రశంసలను అందుకున్నారు.

కట్ చేస్తే.. ఏడాది క్రితమే ఇలాంటి అవిష్కరణతో అకట్టుకున్న యువ ఇంజనీరు.. ఇప్పడు సొంతంగా వ్యాపారం పెట్టుకునే స్థాయికి ఎదుగుతారని ఎవరైనా అశించవచ్చు. అలానే ఈయన కూడా ఖరీదైన అడి కారును కొన్నారు. అయితే ఏ హోదా లేకుండానే తన కారుపై ఎర్ర బుగ్గను పెట్టుకున్నారు. ఒక ఇంజనీరు విద్యను అభ్యసించిన వ్యక్తికి ఎర్రబుగ్గ దేనికి సంకేతం.. ఎవరెవరు దానిని తమ కార్లపైన పెట్టుకోవాలి అన్న విషయం కూడా తెలియదా..? అంటే తప్పకుండా తెలుస్తుంది. కానీ అవన్నీంటినీ పక్కనబెట్టి.. తన కారుకు కూడా ఎర్రబుగ్గను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే అ యువ ఇంజనీరుతో పాటు అతడి గ్యాంగ్ కు చెందిన మరో ఇద్దరు సభ్యులను కూడా పోలీసులు కటకటాల వెనక్కి పంపారు.

అదేంటీ ఎర్రబుగ్గ పెట్టుకోవడం అంత నేరమా అని అలోచిస్తున్నారా..? ఎర్రబుగ్గ మాటున యువ ఇంజనీరు చేస్తున్న దందా తెలిస్తే.. అవ్వాక్కవుతారు. కొత్తగా ప్రభుత్వం ముద్రించిన రూ.2000 నోట్లను నకిలీవి ముద్రిస్తూన్నాడు. వాటిని నల్లధన కుబేరులతో డీల్ కుదుర్చుకుని మారుస్తున్నాడు. ఇదర్ కా మాల్ ఇదర్.. ఇదర్ కా మాల్ ఉదర్ అన్న తరహాలో 30 నుంచి 40 శాతం మేరకు కమీషన్ తీసుకుని డబ్బును మార్పిడి చేస్తున్నాడు. అయితే మార్పిడి కింద ఇతగాడు ఇచ్చేవన్నీ దొంగనోట్లే. ఈ విషయం తెలియక ఇతని బట్టులోపడిన వారందరూ ఇప్పుడు తేలుకుట్టిన దోంగలుగా మారిపోయారు.  ఇంతకీ ఈ యువ ఇంజనీర్ ఎవరంటారా..?

ఆ యువ ఇంజనీర్ పేరు అభివన్ వర్మ. పోలీసులు అతడిని పంజాబ్‌లోని మొహాలీలో అరెస్టుచేశారు. అతడి వద్ద రూ. 42 లక్షల విలువైన దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు. అభినవ్ వర్మ అనే ఈ యువ ఇంజనీరుతో పాటు, అతడి బంధువు విశాఖా వర్మ, లూథియానాకు చెందిన రియల్ ఎస్టేట్ డీలర్ సుమన్ నాగ్‌పాల్‌లను పంజాబ్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కినెట్టారు. వీళ్ల సరికొత్త ఆడి ఎస్‌యూవీలో వెళ్తుండగా తాము ఆపి తనిఖీ చేయగా, అందులోంచి 42 లక్షల దొంగనోట్లు పట్టుబడ్డాయన్నారు. ఈ గ్యాంగులో మరో ఇద్దరు ఉన్నారని, కానీ ఆ ఇద్దరూ పారిపోయారని పోలీసులు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : demonetisation  Rs 2000 not  fake currency  make in india  Rs 2000 miuse  

Other Articles