ప్రసూతి వార్డుగా మారిన కాన్పూర్ పంజాబ్ నేషనల్ బ్యాంకు.. demonetisation effect: Kanpur woman delivers baby in bank queue

Kanpur woman delivers baby inside bank while waiting in queue

Woman delivers baby in bank, Punjab National Bank, Jhinjhak, Kanpur, Sarvesha Devi, Sardarpur Ke Majra, Lohia Awas loan, shahpur dera, Dehat district, Demonetisation, Cash crunch, Uttar Pradesh

A woman delivered a healthy baby girl inside a bank in Kanpur Dehat district of Uttar Pradesh while she was waiting in a queue

ప్రసూతి వార్డుగా మారిన కాన్పూర్ పంజాబ్ నేషనల్ బ్యాంకు..

Posted: 12/03/2016 01:25 PM IST
Kanpur woman delivers baby inside bank while waiting in queue

పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ఎన్ని అవస్థలు పడుతున్నారో అర్థమైయ్యేలా చేసింది ఈ ఘటన. నిండు చూలాలు కూడా క్యూ లైన్లో నిలబడాల్సి వచ్చింది. నెలలు నిండి క్యూ లైన్లోనే అమె తీవ్ర నో్పులు రావడం అప్పటి వరకు అమెను పట్టించుకోని బ్యాంకు అధికారులు.. చివరకు బ్యాంకును ప్రసూతి కేంద్రంగా మార్చాల్సి వచ్చింది.  దీంతో క్యై లైన్లలో నిలబడిని మహిళలు ముందుకోచ్చి నిండు గర్భీణికి ప్రసవం జరిగేలా సాయం చేశారు. ఈ ఘటన కాన్పూర్ ప్రాంతంలోని దేవత్ జిల్లాలో గల పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగింది.

వివరాల్లోకి వెళితే...దేహత్  జిల్లాకు చెందిన సర్వేష (30) తన అత్తతో కలిసి నగదు విత్ డ్రా కోసం జింగ్చక్ ప్రాంతంలో గత పంజాబ్ నేషనల్ బ్యాంకు కు వెళ్లింది. క్యూ లో నిల్చుంది. ఆ రోజు అమెకు డబ్బులు చేతికందకుండానే వెనుదిరిగడంతో మరుసటి రోజున కూడా తన అత్తతో కలసి బ్యాంకుకు వచ్చింది. ఇంతలో సుమారు నాలుగు గంటల ప్రాంతంలో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. అమె పరిస్థితిని గమనించి క్యూలైన్లోని వారు ఆంబులెన్స్కు సమాచారం అందించినా అది  రావడం ఆలస్యమైంది. దీంతో అక్కడున్న మహిళలు ఆమెకు అండగా నిలిచారు. వారి సహాయంతో సర్వేష బ్యాంకులోనే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

అప్పటికీ అంబులెన్సు రాకపోవడంతో పోలీసులు తల్లీబిడ్డలను జింగ్చక్ లోని కమ్యూనిటీ అసుప్రతికి తరలించారు. అయితే  తన కోడలు చాలా  బలహీనంగా ఉండడటంతో తనకు భయమేసిందని సర్వేష అత్తగారు  తెలిపింది. కానీ అందమైన  పుట్టడం సంతోషంగా ఉందనీ, ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారంటూ ఆనందం వ్యక్తం చేసింది. కాగా  ఈ ఏడాది సెప్టెంబర్ లో సర్వేష భర్త  అశ్వేంద్ర రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీనితో యూపీ ప్రభుత్వం  సుమారు రూ.2.75 లక్షలు, ఇల్లు పరిహార ప్రకటించింది. దీనికి సంబంధించి  ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తీసుకోవడకోసం అత్తతో కలిసి బ్యాంకుకు వెళ్లింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles