13 వేల కోట్ల బ్లాక్ మనీ.. మనిషి మిస్టరీ మిస్సింగ్ | Man who disclosed Rs 14000cr black money goes missing.

13 thousand crores in black money man goes missing

Mahesh Shah missing, Ahmedabad Man Black Money, IT dept search Mahesh, Ahmedabad Man 13860 crore, 13860 crore black money, Realtor Mahesh Shah missing

IT dept searches premises of businessman Mahesh Shah who declared Rs 13860 crore under IDS.

13 వేల కోట్ల బ్లాక్ మనీ కనిపించుట లేదు

Posted: 12/03/2016 01:26 PM IST
13 thousand crores in black money man goes missing

గుజరాత్ అహ్మదాబాద్ లో ఓ వ్యాపారవేత్త మాయం కావటం తీవ్ర కలకలాన్నే రేపుతోంది. ఎందుకంటే 13 వేల కోట్ల బ్లాక్ మనీతో ఈ అక్టోబర్ లో ఆయన ఐటీ శాఖకు దొరికిపోయాడు కాబట్టి. 45 ఏళ్ల మహేష్ షా అనే బిజినెస్ మెన్ స్వచ్ఛంద ఆదాయ వెల్లడి సమయానికి తన ఆస్తిని ప్రకటించాడు. అయితే అదంతా బ్లాక్ మనీ అని ఆదాయపు శాఖ అధికారులు తేల్చేశారు.

ప్రస్తుతం ఆ కేసులో విచారణ కొనసాగుతుండగా, ఆయన అదృశ్యం కావటం చర్చనీయాంశంగా మారింది. 12వ తరగతి చదివిన ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి మహా మేధావి అని ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ చెబుతున్నాడు. అసలు షా కనిపించడం లేదని కూడా ఆ సీఏ షెత్నా నే ఫిర్యాదుచేశాడు. దాంతో పోలీసులు, ఐటీ అధికారులు ఆయన ఇళ్లు, కార్యాలయాలన్నింటిలో సోదాలు చేశారు.

అపాజీ అమీన్ అనే సీఏ సంస్థ భాగస్వామి తెహముల్ షెత్నా వద్దకు వెళ్లి ఆదాయ వెల్లడి పథకం(ఐడీఎస్) గురించి మహేష్ అడిగాడంట. ఆ తర్వాత సెప్టెంబర్ 30వ తేదీతో ముగిసిపోతుందనగా.. అదేరోజు రాత్రి 11.55 గంటలకు ఆయన అహ్మదాబాద్‌లోని ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి వెళ్లి, తన వద్ద రూ.13,680 కోట్ల ఆస్తి ఉందని చెప్పారు.

Gujarat Black Money

మరో ఐదు నిమిషాల్లో పథకం గడువు ముగిసిపోతుందని, తనకు మనశ్శాంతి కావాలని, అందుకే తాను మొత్తం ఆస్తి వివరాలు చెప్పేస్తానని ఆయన అన్నట్లు సీఏ షెత్నా చెప్పారు. వెల్లడించినదంతా నగదు రూపంలోనే ఉండటం, అది చాలా పెద్దమొత్తం కావడంతో ఆదాయపన్ను శాఖ అధికారులు ఆ మొత్తాన్ని ఆయన ఇంటికి వచ్చి మరీ తీసుకెళ్లేందుకు కూడా అంగీకరించారు. దానికి సంబంధించిన రహస్యాలు, ఇతర వివరాలన్నింటినీ అధికారులు ఆయనకు వివరించారు. పథకం నిబంధనల ప్రకారం నవంబర్ 30 నాటికి తొలి వాయిదాలో రూ.1560 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ, ఆయన ఆ మొత్తం కట్టలేకపోయారు.

మిస్సింగ్ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, ఐటీ అధికారులు ఆయన ఇళ్లు, కార్యాలయాలన్నింటిలో సోదాలు చేశారు. ఆరోజు రాత్రి 7 గంటల వరకు తనకు ఫోన్లో అందుబాటులో ఉన్నారని, తర్వాత మాత్రం ఆయన ఫోన్ స్విచాఫ్ అయిపోయిందని సమాచారం. పోలీసులు ఎన్నిచోట్ల గాలించినా ఇంతవరకు ఈ మిస్టరీ మాత్రం వీడలేదు. తెర వెనుక రాజకీయ కోణం కూడా ఉందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ahmadebad  Realtor Mahesh Shah  Missing  

Other Articles