రంగా.. రాధా.. మధ్యలో వర్మ | RGV Meets Vangaveeti family over Movie Rumors.

Rgv meets vangaveeti radha over movie controversy

RGV Meets Vangaveeti, Vangaveeti Radha Over Vangaveeti, RGV Vangaveeti, Vangaveeti Radha Kodali nani, Kodali nani RGV, Kodali Nani Varma, Varma Vangaveeti Radha, Varma Devineni Family, Devineni Family Vangaveeti Family, Devineni Vangaveeti movie, Vangaveeti Producer Dasari Kiran, Vangaceeti Movie Director Ram Gopal varma

RGV Meets Vangaveeti Radha Over 'Vangaveeti' Movie Controversy.

ITEMVIDEOS:బెజవాడలో అసలేం జరుగుతోంది?

Posted: 12/03/2016 12:52 PM IST
Rgv meets vangaveeti radha over movie controversy

విజయవాడలో పరిస్థితులు ఇప్పుడు కాస్త ఉద్రిక్తకరంగా మారాయి. వివాదాల కిందేసుకుని కూర్చునే రామ్ గోపాల్ వర్మ 'వంగ‌వీటి' సినిమా ఆడియోను ఈ సాయంత్రం విడుద‌ల చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఒకప్పటి నేత వంగవీటి మోహన రంగ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో వాస్తవ పరిస్థితులను చూపించబోతున్నానంటూ సంచలనానికే తెరలేపాడు. అయితే, సినిమా కల్పితంగా ఉందంటూ రంగ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేయ‌డం, అక్కడ క్లియరెన్స్ లభించటం చూశాం.

ఈ నేపథ్యంలో కొన్ని కట్ లకు ఓకే చెప్పిన వర్మ సినిమా రిలీజ్ కు ఏర్పడిన అడ్డంకులను తొలగించుకునే ప్రయత్నాలు ప్రారంభించాడు. అంతేకాదు రంగారాధ మిత్ర‌మండ‌లి హెచ్చ‌రిక‌లు జారీ చేసిన నేప‌థ్యంలో ఏకంగా రంగ కుటుంబ సభ్యులతో భేటీ అయ్యాడు. శనివారం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ భేటీ సాగుతుండటం విశేషం. ఈ సమావేశానికి వంగవీటి రత్నకుమారి, కుమారుడు వంగవీటి రాధాకృష్ణలతోపాటు వైసీపీ నేత కొడాలి నాని కూడా హాజరై ఇరు వర్గాలతో చర్చిస్తున్నారు.

 

సినిమాకు సంబంధించిన ప‌లు అంశాలను గురించి రాధాకృష్ణ‌కు వ‌ర్మ స్వయంగా వివ‌రిస్తున్నట్లు తెలుస్తోంది. . ఈ భేటీలో వారితో పాటు ఎమ్మెల్యే కొడాలి నాని, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మరోపక్క దేవినేని కుటుంబంతో కూడా కాసేపట్లో వర్మ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వివాదాల నేపథ్యంలో కేవలం మర్యాద పూర్వకంగానే తాము కలిశామని, నిర్ణయం తీసుకోవాల్సింది వర్మేనని కొడాలి చివర్లో వ్యాఖ్యానించటం కొసమెరుపు.

విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ముఠా త‌గాదాల నేప‌థ్యంలో వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. వంగ‌వీటి సినిమా ఏ కులానికీ వ్య‌తిరేకం కాదని అన్నారు. సినిమా వ‌ల్ల మ‌ళ్లీ పాత రోజులు వ‌స్తాయని, గొడ‌వ‌లు జ‌రుగుతాయ‌ని వస్తోన్న వాద‌న‌లు నిజం కావ‌ని వర్మ ఇంతకు ముందే తెలిపాడు. సినిమాలో అభ్యంత‌ర‌క‌ర‌మంటున్న పాట‌ను ఇప్ప‌టికే తీసేశామ‌ని, మూవీలో మ‌రే అభ్యంత‌ర‌క‌ర సీన్లు లేవని స్ప‌ష్టం చేశాడు. డిసెంబర్ 23న సినిమా విడుదల చేసేందుకు వర్మ యత్నిస్తున్నాడు. మరి వంగవీటి ఫ్యామిలీ దీనిని అడ్డుకుంటుందా? అన్నది కాసేపట్లో తెలిసిపోనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vangaveeti Movie  Devineni Nehru  Vangaveeti Family  Varma  

Other Articles