సామాజికంగా వెనకబడిన కాపుకులస్థులను వెనకబడిన తరగతులలో చేర్చాలన్న డిమాండ్ తాము మరోమారు సత్యగ్రహ పాదయాత్రకు పూనుకోనున్నట్లు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. కాపు సత్యాగ్రహ యాత్రను జనవరి 25 నుంచి చేపడతామని ఆయన పునరుద్ఘాటించారు. రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ ఈ యాత్ర చేస్తామని చెప్పారు. దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకునేది లేదని స్పష్టం చేశారు. ఏ అనుమతులు తీసుకుని ప్రతిపక్షంలో వున్నప్పుడు చంద్రబాబు పాదయాత్రలు చేశారని అయన ఎదురు ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్క దేశంలోని ప్రతీ పౌరుడికి వుందని రాష్ట్రోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పినా.. అధికారం చేతిలో వుందికదా అని ప్రభుత్వం ఇష్టానికి వ్యవహరిస్తుందని అన్నారు.
కాపు నేతలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తారని ప్రభుత్వం చెబుతున్నవన్నీ అసత్యాలేనని అయన విమర్శించారు. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో అప్పుడు అక్కున చేర్చుకున్న పార్టీలే నేడు అధికారంలోకి వచ్చి నెలకేసి కొడుతున్నాయ్ అన్నారు. కాపు నేతల చేతులకు బేడీలు వేసి, కళ్లకు గంతలు కట్టి పాదయాత్రకు అనుమతించాలని డిమాండ్ చేశారు. కాకినాడలో సమావేశమైన తరువాత ఉద్యమ భవిష్యత్ కార్యచరణపై మీడియాతో మాట్లాడిన ఆయన కాపులను బీసీ జాబితాలో చేర్చే డిమాండ్‌ను సాధించుకునేందుకు నాలుగు అంచెలుగా ఉద్యమం చేస్తామని చెప్పారు.
డిసెంబరు 18న నల్ల రిబ్బన్లు ధరించి కంచం, గరిటె చేతపట్టుకుని ఎక్కడివారు అక్కడే మోత మోగించి నిరసన తెలపాలని కోరారు. ఆరోజు మధ్యాహ్నం నుంచి తాను ఏదో ఒక జిల్లాలో కార్యక్రమంలో పాల్గొని, 36 గంటలపాటు అక్కడే ఉంటానని చెప్పారు. డిసెంబరు 30న రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు స్థానికంగా ఉండే కాపు నేతలు వినతిపత్రాలను అందజేస్తారని తెలిపారు. జనవరి 9న సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. కాపు సత్యాగ్రహ యాత్రను జనవరి 25వ తేదీన చేపడతామని, రావులపాలెం నుంచి అంతర్వేది వరకు ఈ పాదయాత్ర ఉంటుందని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more