బాఫ్ రే బాప్..! రిలయన్స్ జియోకు మైండ్ బ్లాక్ చేసే ఫైన్.. Jio could face Rs 500 fine for using PM Modi's pic in ad

Jio could face rs 500 fine for using pm modi s pic in ad

Reliance Jio, Rs 500 fine, PM Modi's pic in ads, Jio offer,rajyavardhan singh rathore, India News, Business News, Latest News

Reliance Jio may have to pay a penalty of just up to Rs 500 for using Prime Minister Narendra Modi's photograph in print and electronic advertisements without permission.

బాఫ్ రే బాప్..! రిలయన్స్ జియో, ఫేటీయంలకు మైండ్ బ్లాక్ చేసే ఫైన్..

Posted: 12/03/2016 09:06 AM IST
Jio could face rs 500 fine for using pm modi s pic in ad

వడ్డించే వాడు మనవాడైతే.. ఏ మూలన కూర్చున్నా ఫర్వాలేదని పెద్దలు చెప్పిన సామెత అక్షరాల నిజమని కేంద్ర ప్రభుత్వ అధికారుల వైఖరి స్పష్టం చేస్తుంది. బావ ప్రకటన వెల్లడిస్తే.. పోలీసు పిర్యాదులు.. జైలు గోడలను సునాయాసంగా పరిచయం చేసే అధికారులు.. ప్రముఖ వ్యక్తుల ఫోటోలను వారి అనుమతి లేకుండా వినియోగించుకున్నందుకు పడే జరిమానా చూస్తే మాత్రం కళ్ల బైర్లుగమ్మే షాక్ తగులుతుంది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లిఖిత సమాధానంలో తెలిపారు.

ఇదే జరిమానా ఇప్పుడు రిలయన్స్ జియో, పేటీయం సంస్థలు కూడా ఎదుర్కోనుంది. అనుమతి లేకుండా ప్రధాని ఫొటోను జియో ప్రకటనలలో వాడుకున్నందుకు గాను ఈ జరిమానాను విధిస్తామని చెప్పారు. రిలయన్స్ జియో, పేటీయం సంస్థలు ప్రధాని ఫోటోను ప్రకటనల్లో వాడుకుందన్న విషయం ప్రభుత్వానికి తెలుసని కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానంపై లో తెలిపడంతో దీన్ని ఎలా అనుమతించారని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నీరజ్ శేఖర్ ప్రశ్నించారు. ప్రధానమంత్రి ఏదైనా ఒక ప్రైవేటు కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ కాకుండా చూసే చట్టం ఏమైనా ఉందా అని నీరజ్ శేఖర్ ప్రశ్నించారు.

అయితే కేవలం 500 రూపాయలు ఫైన్ మాత్రమే విధించనున్నారన్న సమాచారం తో భవిష్యత్ లో ప్రధాని సహా కేంద్ర మంత్రుల ఫోటోలను అనుమతి లేకుండా వినియోగించుకునే వారి సంఖ్య అధికమౌతుందని ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది. అయితే ఈ ప్రకటనలపై ఏకంగా పార్లమెంటులోనే సభ్యులు నిలదీస్తున్న క్రమంలో ఎలాంటి పిర్యాదు అందలేదని, అందుచేత ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదని కూడా కేంద్రమంత్రి రాధోడ్ చెప్పడం పలు విమర్శలకు దారి తీస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Reliance Jio  Rs 500 fine  PM Modi's pic in ads  Jio offer  India News  Business News  

Other Articles