ఆ శవం మార్చురీ నుంచి నేరుగా పబ్ కి... | Dead declared man move to Pub from Morgue.

Man wakes up in morgue after dying on night out

morgue pub, Dead declared man walk out, Pub to Morgue, Vodka Shots Morgue, Morgue man alive, Morgue man walk, Morgue to Pub, man alive in Morgue

The 25-year-old man was pronounced dead after having a vodka-induced heart attack but he then came to and found himself in the morgue.

వోడ్కా కిక్కు ఎంత పని చేసింది

Posted: 12/03/2016 10:19 AM IST
Man wakes up in morgue after dying on night out

చనిపోయాడనుకున్న వ్యక్తి ప్రాణాలతో తిరిగి వచ్చిన ఘటనలు ఉన్నా ఇక్కడ మనం చెప్పుకోబోయేది. కాస్త విచిత్రమైన ఘటనే. ఎందుకంటే ఆ వ్యక్తి లేచి వచ్చింది పాడే మీది నుంచి కాదు, చచ్చాడని కన్ఫర్మ్ చేసుకుని మార్చురీలో పెట్టాక..

పోలండ్ కి చెందిన కమిల్ అనే వ్యక్తి స్నేహితులతోపాటు పబ్ కెళ్లాడు. అక్కడ పీకల్దాక ఓడ్కా తాగిన కమిల్ స్నేహితుల కళ్లముందే పడిపోయాడు. అతనిని ఎంత లేపినా లేవలేదు. దీంతో గుండెపోటు అనుకుని కంగారు పడిపోయిన అతని స్నేహితులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు కూడా తందాన అన్న చందాన చనిపోయాడంటూ డిసైడ్ చేసి బాడీని మార్చురీకి పంపించేశారు. .

తర్వాత అర్ధరాత్రి మార్చురీలోంచి శబ్దాలు రావడంతో వణికిపోతూ గార్డు తలుపు తీయగానే, 'బాగా చలిగా ఉంది. దుప్పటి కావాలి' అంటూ నగ్నంగా ఉన్న కమిల్ అడిగాడు. దీంతో బెంబేలెత్తిపోయిన గార్డు అతనికి దుప్పటి ఇచ్చి, వైద్యులు, పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో అతను ఓడ్కా కారణంగా ఒళ్లు తెలీనంతగా నిద్రపోయాడని, ఆ మత్తులోనే బట్టలు కూడా విప్పేసుకున్నాడని తెలిపారు. ఫార్మాలిటీస్ పూర్తి చేసిన అనంతరం అతనిని డిచ్చార్జ్ చేయగా, మందు బాబుకి మార్చురీ రూం కిక్కు నచ్చలేక డైరక్ట్ గా మళ్లీ పబ్ లోకి వెళ్లిపోయాడంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Morgue  Man  alive  Pub  

Other Articles