ఓట్ల కోసం కాదు.. నోట్ల కోసమేనన్న కేజ్రీవాల్ Kejriwal Campaign Against Demonetisation, says Vote for anyone but BJP

Kejriwal kicks off campaign against demonetisation says vote for anyone but bjp

arvind kejriwal, kejriwal, uttar pradesh elections, demonetisation, bjp up, aap, aam aadmi party, aap campaign, bjp, aap target bjp, up polls, indian express news, india news

Kejriwal reiterated his allegations against PM Modi of ‘favouring his friends’ by ‘waiving off their loans’ and helping them stash away black money.

ఓట్ల కోసం కాదు.. నోట్ల కోసమేనన్న కేజ్రీవాల్

Posted: 12/02/2016 06:27 PM IST
Kejriwal kicks off campaign against demonetisation says vote for anyone but bjp

రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ఏ పార్టీకైనా ఓటు వేయవచ్చు.. అధికారాన్ని అందించవచ్చు.. కానీ బీజేపికి మాత్రం అధికారాన్ని అందించవద్దని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఓటర్లను అభ్యర్థించారు. తమ వారికి ముందస్తు సమాచారం అందించి ఆ తరువాత పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రభుత్వంపై ప్రజలు ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. తాను ఈ మాటలు ఓట్ల కోసమే చెప్పడం లేదని.. అ విషయానికి వస్తే తన పార్టీ అసులు ఉత్తర్ ప్రదేశ్ లోనే పోటీ చేయడం లేదని చెప్పారు.

ఉత్తరప్రదేశ్‌లో ఓ ర్యాలీలో కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. బీజేపీకి తప్ప ఎవరికైనా ఓటు వేయండంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్‌ దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న యూపీలో ఆయన తొలి ర్యాలీలో పాల్గొన్నారు.ప్రధాని మోదీ తన స్నేహితుల రుణాలను రద్దు చేసి వారికి సాయపడ్డారని కేజ్రీవాల్‌ విమర్శించారు. అంతేగాక నల్లధనం సర్దుకోవడానికి ప్రధాని వారికి అవకాశమిచ్చారని ఆరోపించారు.

‘ఉత్తరప్రదేశ్ వల్లే మోదీ ప్రధాని అయ్యారు. ఇక్కడ 80 లోక్‌సభ స్థానాలకు 73 బీజేపీకి ఇచ్చారు. నేను ఓట్లు అడగటానికి ఇక్కడికి రాలేదు. ఓట్ల కోసం అయితే మా పార్టీ పోటీ చేస్తున్న పంజాబ్‌ లేదా గోవాకు వెళ్లేవాడ్ని. దేశాన్ని కాపాడాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థించడానికి వచ్చాను. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు తనపై కేసులు పెడుతున్నారు. తాను చెబుతున్న నిజాలు కన్న బీజేపి నేతలు చెబుతున్న అబద్దాలను ప్రజలు అధికంగా నమ్ముతున్నారని, ఇందుకు అబద్దాన్ని కూడా పదే పదే చెప్పి నిజంగా ఏమార్చుతున్నారని కేజ్రీవాల్ దుయ్యబట్టారు.

లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాను తమ అశీర్వదనాలతో దేశం విడిచి పారిపోయేందుకు మోదీ సాయపడ్డారు. మాల్యా బకాయిపడ్డ బ్యాంకు రుణాలను మాఫీ చేశారు. పెద్ద నోట్ల రద్దు విషయాన్ని మోదీ తన స్నేహితులకు ముందే చెప్పారు. దీంతో వాళ్లు నల్లధనాన్ని సర్దుకునేందుకు అవకాశం కల్పించారు. సామాన్యులు మాత్రం డబ్బుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులు, ఏటీఎంల మందు క్యూలో గంటల కొద్దీ నిల్చున్నా నగదు దొరకడం లేదు. మీరు ఏ పార్టీకైనా ఓటు వేయండి. బీజేపీకి మాత్రం వేయకండి’ అని కేజ్రీవాల్‌ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arvind kejriwal  narendra modi  demonitisation  black money  uttar pradesh  

Other Articles