టాక్ అప్ ది పార్లమెంటుగా ఆ ముఖ్యమంత్రి.. Furore In Parliament Over Security Of Mamata Banerjee

That state chief minister has become talk of the parliament

mamata banerjee, BJP, Mallikarjun Kharge, Congress, Lok Sabha, Ananth kumar, PM Modi, Pradhan Mantri Jan-Dhan Yojana, RBI, Specified Bank Notes, Cash withdrawal, RBI, Jan Dhan accounts, demonetisation, withdrawal limit, KYC norms, Reserve Bank of India, banknotes, currency

When there is no fuel, its the duty of ATC to have allowed landing of Mamata Banerjee’s flight, her life is in danger: Kharge,Congress in LS

టాక్ అప్ ది పార్లమెంటుగా ఆ ముఖ్యమంత్రి..

Posted: 12/01/2016 03:17 PM IST
That state chief minister has become talk of the parliament

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజాఉద్యమాన్ని చేపట్టిన నేపథ్యంలో ఇవాళ అమె టాక్ అఫ్ ది పార్లమెంటుగా మారారు. విషయంలోకి వస్తే.. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ప్రజా అందోళన కార్యాక్రమాలకు పిలుపునివ్వడం.. ఇందులో భాగంగా అమె బీహార్ కు వెళ్లి అక్కడ కూడా డీమానిసటేషన్ కు వ్యతిరేకంగా సభలో మాట్లాడి రావడం అంతా తెలిసిందే.

ఈ తరుణంలో అమె పశ్చివ బెంగాల్ కు తిరిగివస్తున్న క్రమంలో అమె ప్రయాణిస్తున్న ఇండిగో విమానం కోల్‌కతా విమానాశ్రయం వద్ద దాదాపు అరగంట పాటు ల్యాండింగ్ కాకుండా గాలిలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇంధనం అయిపోతుందని పైలట్ ఏటీసీ అధికారులకు చెప్పినా.. విమానాన్ని దించేందుకు ఏటీసీ అధికారుల నుంచి అనుమతి రాకపోవడంతో సుమారు అరగంట తరువాత విమానాన్ని కిందకు దించారు. దీంతో మమత బెనర్జీని హత్య చేయడానికే కుట్ర జరిగిందని ఆ పార్టీకి చెందిన మంత్రి ఫిర్హాద్ హమీక్ అరోపించారు.

ఇదే అంశంపై అటు అటు పార్లమెంటులోనూ ప్రతిధ్వనించింది. లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున్ ఖార్గే అమె ప్రాణాలకు ముప్పు పోంచివుందని అందోళన వ్యక్తం చేశారు. తృణముల్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు తమ అధినేత్రికి జరిగిన విషయాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకువచ్చిన క్రమంలో వారు ఖార్గే స్పందిస్తూ మమతకు విమానంలో ఎదురైన పరిస్థితి సహేతుకరమైనది కాదని అన్నారు. కోల్‌కతా విమానాశ్రయంలో జరిగినది ఏమాత్రం సరికాదని, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని అన్ని ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు డిమాండ్ చేశారు.
 
దీనికి పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు లో్క్‌సభలో సమాధానం ఇచ్చారు. కోల్‌కతా విమానాశ్రయంలో అదే సమయానికి మొత్తం మూడు విమానాలు ల్యాండింగ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయని, మూడు విమానాల పైలట్లు కూడా దిగేందుకు అనుమతి కోరారని.. అయితే వాళ్లలో ఏ ఒక్కరూ ప్రయారిటీ ల్యాండింగ్ కావాలని మాత్రం అడగలేదని ఆయన చెప్పారు. కాగా, అసలు విమానాలు టేకాఫ్ తీసుకోడానికి ముందు అందులో తగినంత ఇంధనం ఉందా లేదా అనే విషయంపై డీజీసీఏ విచారణకు ఆదేశించామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mamata banerjee  BJP  Mallikarjun Kharge  Congress  Lok Sabha  Ananth kumar  PM Modi  demonetisation  

Other Articles