అబద్దాలతోనే నెగ్గుకోచ్చాడా..? ఈజీగా ప్లేటు మార్చుతున్న ట్రంప్ Pakistan welcomes Trump's comment on resolving issues

Trump expresses willingness to solve fantastic pakistan s problems

Donald Trump, America, Nawaz Sharif, pakistan, U turn, hillary clinton, US Elections, Washington, US State Department, South Asia, Quetta, Panama, Islamabad, Haqqani, Department of State

US President-elect Donald Trump, who vowed to ban Muslims from the US+ , purportedly told beleaguered Pakistan Prime Minister Nawaz Sharif yesterday that he's a "terrific guy", " has a very good reputation

అబద్దాలతోనే నెగ్గుకోచ్చాడా..? ఈజీగా ప్లేటు మార్చుతున్న ట్రంప్

Posted: 12/01/2016 03:20 PM IST
Trump expresses willingness to solve fantastic pakistan s problems

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగిన డొనాల్డ్‌ ట్రంప్ అబద్దాలను నిజాలుగా వల్లే నెగ్గుకోచ్చారా..? అంటే అవునన్న సమాధానాలే వినబడుతున్నాయి. అగ్రరాజ్య చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో గెలిచిన పగ్గాలను అందుకోబోతున్న అధ్యక్షుడికి వ్యతిరేకంగా నిరసనలు, అందోళనలు తెరపైకి రాలేదు. కానీ ముక్కుసూటి మనిషిగా.. వివాదాలకు కేరాఫ్ గా మారిన అభ్యర్థిగా బరిలో నిలిచి.. అధ్యక్షుడిగా ఎన్నిక కాగానే తాను చెప్పిన మాటలన్నింటినీ వెనక్కు తీసుకుని కొత్త ఒరవడికి నాంది పలుకుతున్నారు ట్రంప్.

అధ్యక్ష బరిలో నిలచిన సందర్బంగా చేసిన వ్యాఖ్యలకు.. పగ్గాలను చేపట్టబోతున్న తరుణంలో ఆయన వైఖరి మార్పులు కొట్టోచ్చినట్టు కనబడుతున్నాయి. తిట్టిన నోటితోనే పోగడటం రాజకీయ నేతలకు అలావాటే అని సామాన్యులు ఎంతగానో విమర్శించినా.. వారి వైఖరిలో ఏ మాత్రం మార్పు రాదన్నది మాత్రం సుస్పష్టం అవుతుంది. మరీ ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడి పగ్గాలను జనవరి 20న అందుకోబోతున్న ట్రంప్ విషయంలో కోట్టోచ్చినట్టు కనబడుతుంది. ఇక దీనిని రాజనీతి, చాణక్య నీతి అని పలువరు కొనియాడటం.. సమంజసమేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

నాడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశం పాకిస్థాన్‌ అని, దీనిని నిరోధించగలిగేది ఒక్క భారత్‌ మాత్రమేనని పేర్కొన్న ట్రంప్‌ ఇప్పుడు ఏకంగా పాకిస్థానీలు అత్యంత తెలివైనవాళ్లు అంటూ సరికొత్త ట్విస్టు ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం పాకిస్థాన్‌కు సానుకూల సంకేతాలు ఇచ్చారు. పాకిస్థాన్‌కు చెందిన ఏ సమస్యలైనా పరిష్కరించడానికి తాను సిద్ధమంటూ ఆ దేశ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు తెలిపారు.

అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు ఫోన్‌ చేసి షరీఫ్‌ అభినందించిన సందర్భంగా.. ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అపరిష్కృతంగా ఉన్న ఎలాంటి సమస్యల పరిష్కారంలోనైనా నా వంతు పాత్ర పోషించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీనిని నేను గౌరవంగా భావించి వ్యక్తిగతంగానూ కృషి చేస్తాను. నేను అధ్యక్ష పదవి స్వీకరించే జనవరి 20లోపు కూడా కావాలంటే ఎప్పుడైనా ఫోన్‌ చేయవచ్చు’ అని ట్రంప్‌ పేర్కొన్నట్టు పాక్‌ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, తాను పరిష్కరించదలుచుకున్న అపరిష్కృత సమస్యలు ఏమిటన్నది ట్రంప్‌ వివరణ ఇవ్వలేదు.

అదేవిధంగా షరీఫ్‌పైనా ట్రంప్‌ ప్రశంసల జల్లు కురిపించారు. ఆయనకు మంచి పేరుప్రఖ్యాతలు ఉన్నాయని, అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. పాకిస్థాన్‌ అద్భుతమైన అవకాశాలు గల దేశమని, పాకిస్థానీలు అద్భుతమైన తెలివితేటలు గల మనుష్యలని పొగడ్తల్లో ట్రంప్ ముంచెత్తారు. పాకిస్థాన్‌కు రావాల్సిందిగా షరీఫ్‌ ఆహ్వానించగా, ఆ అద్భుతమైన దేశానికి రావడం తనకెంతో ఇష్టమని, పాకిస్థానీలు అద్భుతమైన వ్యక్తులని తాను చెప్పినట్టు వారికి చెప్పాలని షరీఫ్‌కు సూచించారు.

అమెరికా ఎన్నికల బరిలో  ట్రంప్ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు మార్చిన వ్యాఖ్యలు:

గ్లోబల్ వార్మింగ్‌పై..
అప్పుడు: గ్లోబల్ వార్మింగ్ అనేది ఓ బూటకం. అసలు అది లేనే లేదు. అమెరికాను చైనాకు పోటీగా లేకుండా చేసేందుకు చేసిన కుట్ర మాత్రమే. అది చైనా కోసం చేసిన చర్య. అది ఒక ఖరీదైన మోసం.
ఇప్పుడు: 'గ్లోబల్ వార్మింగ్కు మానవ చర్యలకు గ్లోబల్ వార్మింగ్కు ఏదో సంబంధం ఉంది. ఈ విషయాన్ని నేను చాలా దగ్గరిగా పరిశీలిస్తున్నాను. ఈ విషయంలో నేను చాలా ఓపెన్ గా ఉన్నాను.
హిల్లరీ ఈమెయిల్స్ పై:..
అప్పుడు: నేను ఎన్నికల్లో విజయం సాధిస్తే ఒక ప్రత్యేక న్యాయవాది ద్వారా హిల్లరీ ఈమెయిల్స్ అవినతి వ్యవహారాన్ని చూడాలని నా అటార్నీ జనరల్ ను ఆదేశిస్తాను.
ఇప్పుడు: 'క్లింటన్పై క్రిమినల్ చర్యలు తీసుకుంటే దేశంలో చాలా చీలికలు వస్తాయని నాకు అనిపిస్తుంది'
అధ్యక్షుడు ఒరాక్ ఒబామాపై..
అప్పుడు: అమెరికా చరిత్రలోనే ఓ చెత్త అధ్యక్షుడిగా బరాక్ ఒబామా దిగిపోతారు.
ఇప్పుడు: నాకు అధ్యక్షుడు ఒబామా అంటే చాలా ఇష్టం. ఆయన మంచి నాయకుడు. అంటూ గతంలో తన మాటల నుంచి పక్కకు జరిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donald Trump  America  Nawaz Sharif  pakistan  U turn  hillary clinton  US Elections  

Other Articles