ఇంధన ధరల రివర్స్ గేర్.. పెరిగిన పెట్రోల్.. తగ్గిన డీజిల్.. Petrol costlier; diesel cheaper from midnight

Petrol costlier diesel cheaper from midnight

petrol, diesel, petrol prices, diesel prices, Petrol price, Petrol price hike, Petrol price news, Diesel price, Diesel price news, Diesel price cut, Business news

Petrol price was today hiked by a marginal 13 paisa a litre while diesel rates were cut by 12 paisa in line with global trends.

ఇంధన ధరల రివర్స్ గేర్.. పెరిగిన పెట్రోల్.. తగ్గిన డీజిల్..

Posted: 11/30/2016 07:20 PM IST
Petrol costlier diesel cheaper from midnight

పెద్ద నోట్ల రద్దుతో దేశంలో అవినీతి, నల్లధనం పోయి నిత్యావపర ధరలన్నీ కిందకు దిగివస్తాయని, దాంతో పాటు ఇంధన ధరలు కూడా తగ్గుముఖం పడుతాయని, అటు సోషల్ మీడియాలో ఉవ్వెత్తున్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. అందుకు భిన్నంగా ఇంధన సంస్థలు వ్యవహరించాయి. జనవరి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు యాభై శాతానికి పైగా తగ్గుతాయని కూడా సామాజిక మాధ్యమంలో ప్రచారం జరుగుతుంది.

ఇదిలావుండగా, ఇప్పటికే కరెన్సీ కష్టాలతో సతమతం అవుతున్న వాహనదారులకు మరో షాక్ ఇచ్చింది కేంద్రం. అయితే బీజేపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత నిత్యం డీజిల్ ధరలు పెంపుపై మాత్రమే అధికంగా దృష్టి సారించిన కేంద్రం ఈ సారి రివర్స్ గేర్ లో పయనించింది. డీజిల్ ధరలను తగ్గించి.. పెట్రోల్ వాహనదారులకు మాత్రం స్వల్పంగా వాత పెట్టింది.. లీటరు పెట్రోల్ ధర 0.13 పైసలు పెరిగింది. ఈ మేరకు ఆయిల్ కంపెనీలు ఇవాళ రాత్రి నిర్ణయాన్ని వెల్లడించాయి.

అదే సమయంలో డీజిల్ ధర 0.12 పైసలు (ఒక లీటరుకు)తగ్గింది. కొత్త ధరలు నేటి(నవంబర్ 30) అర్థరాత్రి నుంచి అమలులోకి వస్తాయని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. నవంబర్ 15న  లీటరు పెట్రోల్పై రూ.1.46 పైసలు, లీటరు డీజిల్పై రూ.1.53 పైసలు తగ్గిన సంగతి తెలిసిందే. ప్రతి 15 రోజులకు ఒకసారి ఆయిల్ ధరలను సమీక్షించే కంపెనీలు.. చివరిసారిగా నవంబర్ 15న ధరలు తగ్గించాయి. నేటి సమీక్షలో పెట్రోల్ ధరలు పెంచి, డీజిల్ ధరలు తగ్గిస్తున్నట్టు తెలిపాయి.  కొత్త ధరల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.66.10, లీటరు డీజిల్ రూ.54.57గా ఉండనున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol  diesel  price hike  oil companies  Business  

Other Articles