జమ్మూ నగ్రోటా యూనిట్ పై ఉగ్రవాదుల దాడి.. Terrorists attack Army unit in Nagrota near Jammu

2 soldiers killed in terror attack on army unit in nagrota near jammu

Jammu and Kashmir, Nagrota army camp, militants attack Nagrota Cantonment, India-Pak border, Gunfight

Two soldiers, including a major, were killed as army commandos battled heavily armed militants in Jammu and Kashmir’s Nagrota cantonment.

జమ్మూ నగ్రోటా యూనిట్ పై ఉగ్రవాదుల దాడి..

Posted: 11/29/2016 12:28 PM IST
2 soldiers killed in terror attack on army unit in nagrota near jammu

పెద్ద నోట్ల రద్దుతో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని, కాశ్మీర్ లో అల్లర్లు పూర్తిగా చల్లబడ్డాయని అనుకుంటున్న తరుణంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్మూ జిల్లాలోని నగ్రోటా కంటోన్మెంటు ఆర్మీ యూనిట్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఇవాళ తెల్లవారుజామున 5:30 గంటలకు ఉగ్రవాదులు ఒక్కసారిగా ఆర్మీ క్యాంప్‌పై గ్రెనేడ్‌లు, కాల్పులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక మేజర్ తో పాటు మరో జవాను అమరులయ్యారని సమాచారం.
 
నగ్రోటా ఆర్మీ మెస్ వద్ద ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడటంతో ఒక్కసారిగా షాక్ గురైన భారత బలగాలు.. వెనువెంటనే తేరుకుని ఎదురుకాల్పులు ప్రారంభించడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని సీనియర్‌ భద్రతా అధికారి వెల్లడించారు. కాగా మెస్ ప్రాంతంలో మరో ఇద్దరు ఉగ్రవాదులు నక్కి వున్నారు. దీంతో భారత రక్షణ బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదరుకాల్పులు జరుగుతున్నాయి.

అధికారులు సమాచారం ప్రకారం నలుగురు ఉగ్రవాదులు ఆర్మీ యూనిట్ లోకి అక్రమంగా ఇవాళ తెల్లవారు జామున ప్రవేశించి.. మెస్ ప్రాంతంలో మాటు వేసి కాల్పులకు పాల్పడ్డారు. దీనిపి భారత బలగాలు ధీటుగానే ప్రతిఘటిస్తున్నాయని తెలిపారు. కాగా, ముందు జాగ్రత్త చర్యగా నగ్రోటాలోని పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. జమ్మూ-శ్రీనగర్‌ హైవేను మూసివేసి తనిఖీలు ముమ్మరం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles