క్యాష్ లేదని కార్డు వాడితే క్షవరం చేస్తున్నారు | Debit and Credit cards sur charges demonetization.

Demonetization effect on debit and credit cards

Credit/debit card usage, Credit debit card charges, Credit and debit card rules, RBI on Credit/debit card usage, Credit/debit card surcharges, Credit and debit card, Net Banking transactions

Credit/debit card usage surges on demonetization.

క్యాష్ బదులు కార్డు.. వాడితే క్షవరమేనా?

Posted: 11/29/2016 12:27 PM IST
Demonetization effect on debit and credit cards

పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుభేరుల మాట ఏమోగానీ, 21 రోజులు గడుస్తున్నా ప్రజానీకంకు కరెన్సీ కష్టాలు మాత్రం తీరటం లేదు. పాత నోట్లను మార్చేసుకుని, ఉన్న కొత్త నోట్లపై అంతా ఒక్కసారిగా ఎగబడిపోవటం, అన్ని ప్రాంతాల్లోకి కొత్త నోట్లు చొచ్చుకుని పోకపోవటం, వచ్చిన నోట్లను చాలా జాగ్రత్తగా దాచుకుంటుడంతో నోట్ల చెలామణి దాదాపుగా స్థంభించిపోయింది. వెరసి ఒక్కసారిగా నోట్ల కొరత ఏర్పడింది. పోనీ బ్యాంకులు, ఏటీఎంల నుంచి విత్ డ్రా చేసుకుందామంటే వాటిపైనా పరిమితులు విధించారు. దీంతో వేల కోట్ల వ్యాపారంకు దెబ్బ ఆగిపోతుండగా, కొందరు మాత్రం పరిస్థితులను తట్టుకునేందుకు ఆన్ లైన్ చెల్లింపులు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను ఆశ్రయిస్తున్నారు. మరి ఇది ఎంత వరకు సేఫ్ అన్నది ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా కార్డులతో పేమెంట్లు చేయటం చాలా సులువైన పద్ధతి. అదే సమయంలో అదనపు భారంను కూడా భరించాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతేకాదు ఒక్కోసారి అవసరానికి మించి కొనుగోళ్లు జరపాల్సిన పరిస్థితులు కూడా దాపురిస్తుంటాయి. కానీ, పెద్ద నోట్ల రద్దుతో చిక్కుల్లో ఉన్న జనాలకు కార్డుల ద్వారా బదిలీలకు ఆ చార్జీలను ఎత్తివేస్తున్నట్లు స్వయంగా ఆర్తిక సలహాదారు శక్తికాంత దాస్ ప్రకటించినప్పటికీ, బ్యాంకులు మాత్రం దానిని పాటించడం లేదు. ఇలాంటి సమయంలో కొనుగోళ్లకు క్యాష్ కోసం ఎదురు చూడటమే మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తూ పెద్ద వివరణే ఇస్తున్నారు.

కార్డులతో రిస్కేనా?

దేశం మొత్తం మీద అన్ని బ్యాంకులు కలిపి ఇప్పటిదాకా 71 కోట్ల డెబిట్ కార్డులను జారీ చేయగా, ఇందులో 13 కోట్ల కార్డులు మాత్రమే లావాదేవీలను జరుపుతున్నాయంట. మిగతా వారిలో చాలా మంది కేవలం ఏటీఎం ల నుంచి డబ్బు డ్రా చేయడానికి మాత్రమే కార్డులను వాడుతున్నారన్న మాట. ఇక ఇక్కడ ఉన్న మరో పెద్ద సమస్య ఏంటంటే... సరిపడా పీఓఎస్(పాయింట్ ఆఫ్ సేల్స్) మిషిన్లు అందుబాటులో లేకపోవటం. కార్డుల చెల్లింపు సురక్షితమైనది కాదన్న భావనతో ఇంతకాలం కేవలం నగదుతోనే చెల్లింపు చేసేందుకు జనాలు ఆసక్తి చూపేవారు. కానీ, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఖచ్ఛితంగా కార్డు వాడాల్సిన పరిస్థితి చాలా మందికి ఎదురవుతోంది.

పోనీ అలాగైన లావాదేవీ చేయాలంటే ఛార్జీల పేరుతో బాదేందుకు ఆయా వ్యాపార సంస్థలు సిద్ధంగా ఉంటాయి. పీవోఎస్ ల మెయింటెన్ చేసే షాపులు అదనపు భారాన్ని ఇప్పుడు వినియోగదారుల మీదే వేస్తున్నాయి. దీంతో ఎక్కువ ధరకు కొనుగోలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోపక్క నిత్యావసర వస్తువుల కోసం కూడా ఈ కష్టాలు తప్పటం లేదు. చిన్న చిన్న పచారీ కొట్లలో స్వైపింగ్ మిషన్లు ఉండవు కాబట్టి, ఖచ్ఛితంగా మాల్స్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఇదే అదనుగా భావించిన వారు బల్క్ కొనుగోళ్లపైనే డిస్కౌంట్ పెట్టడమే కాదు, ఎక్కువ పరిమాణంలో కొంటేనే కార్డు అంగీకరిస్తామంటూ మెలికలు పెడుతున్నారు. తద్వారా 5 నుంచి 20 శాతం వరకు ఖర్చుతో సామాన్యుడి నడ్డివిరుగుతోంది. దీనికి తోడు రవాణా వ్యయాలు అదనం.

పోనీ ఈ బాధలన్నీ తప్పించుకుని ఆన్‌లైన్‌ బాట పడదామా అంటే చార్జీలతో బ్యాంకులు కూడా తక్కువేం బాదటం లేదు. దానికి తోడు బిల్లు నిర్దేశిత పరిమితి దాటినప్పుడే ఉచితంగా డెలివరీ చేస్తామంటూ కొన్ని కంపెనీలు కండిషన్లు. ఆ లెక్కన నెట్ బ్యాంకింగ్ తో కూడా జనాలకు క్షవరమే మిగులుతోంది. పెట్రోల్ బంక్ లు, రవాణా చార్జీలు, పెట్రోల్ బంక్ లు, షాపింగ్ మాల్ లు ఇలా ఎక్కడైనా సరే డెబిట్‌ కార్డులైతే 0.75-1 శాతం, క్రెడిట్‌ కార్డులైతే 2 శాతం చార్జీలు పిండేసుకుంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో అన్ని బ్యాంకింగ్ లు ముందుకు వచ్చి అదనపు చార్జీలకు సడలింపు ఇచ్చి కార్డుల చెల్లింపునకు ప్రోత్సహించి, వ్యాపారస్థులకు టాక్స్ భారానికి కూడా మినహాయింపు ఇస్తే బావుంటుందన్నది ఆర్థిక వేత్తల భావన.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Credit and debit card  Usage  Charges  Demonetization  

Other Articles