నోట్ల రద్దు: కళకళలాడుతున్న ముంబై డాన్స్ బార్లు.. Shower of big notes, petals in Mumbai dance bars

Dance bars across maharashtra still accepting demonetised notes

Demonetisation, PM Modi, Dance bars, Mumbai, Thane, Bhiwandi, Narendra Modi, police, parallel currency, Maharashtra, Rs 500 and Rs 1000

Dance bars across Mumbai and some other parts of Maharashtra are not only accepting demonetised currency notes but are also using a parallel currency completely created by themselves for their use.

నోట్ల రద్దు: కళకళలాడుతున్న ముంబై డాన్స్ బార్లు..

Posted: 11/29/2016 12:27 PM IST
Dance bars across maharashtra still accepting demonetised notes

దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతుంటే.. అక్కడ మాత్రం వాటి ప్రభావం ఏ మాత్రం కనింపించడం లేదు. ఈ నెల 8 నుంచి దేశంలో రద్దైన పెద్ద నోట్లు అక్కడ యధేశ్చగా చెల్లుబాటు అవుతున్నాయి. మరోలా చెప్పాలంటూ.. పెద్ద నోట్లు రద్దు కావడంతో అక్కడి పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఏదో సాయంత్రాలు కికిరిసిపోయే ప్రాంతాలు ఇప్పుడు ఒక్కసారిగా రాత్రింబవళ్లు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. అవేంటో మాకు తెలుసులే. బ్యాంకుల గురించేగా మీరు ప్రస్తావించేది అని అనుకుంటే పోరబాటే.

అవి డాన్సు బార్లు. దేశ ఆర్థిక రాజధాని ముంబై పరిసరాల్లో పుట్టగొడుల్లా వేలసిన డాన్స్ బార్లలో పెద్దనోట్లు ఏమాత్రం సంశయం లేకుండా చెలామణి అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేశాక చాలా వ్యాపార, వాణిజ్యాలకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు అన్ని రంగాలపై ప్రభావం పడి నెలచూపులు చూస్తుండగా, డాన్స్‌ బార్స్‌ వ్యాపారం మాత్రం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగానే సాగుతుంది.

ముంబై సహా మహారాష్ట్రలో చాలా ప్రాంతాల్లో అక్రమంగా డాన్స్‌ బార్స్‌ నడుపుతున్నారు. వీటికి తరచూ రాజకీయ నాయకులు, గ్యాంగ్‌​స్టర్స్‌, వ్యాపారవేత్తలు వస్తుంటారు. ఇక్కడ ఎక్కువగా బ్లాక్‌ మనీ చెలామణి అవుతుంటుంది. మహిళా డాన్సర్లపై పాత నోట్లను విసురుతుంటారని జాతీయ మీడియా వెల్లడించింది. అంతేగాక నకిలీ నోట్లు మారుస్తుంటారు. నోట్ల మార్పిడిలో డాన్సర్లది కీలక పాత్రని, డాన్స్‌ బార్స్‌ ఆపరేటర్లకూ ప్రమేయముందని పేర్కొంది.

ఇదిలావుండగా, మహారాష్ట్రలోని డాన్సుబార్లకు మన దేశ కరెన్సీతో అసలు ప్రమేయమే లేదని కూడా సమాచరం. అందుకని వారు తమకు అనుగూణంగా మరో కరెన్సీని వినియోగిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఇది కేవలం ముంబై లోని డాన్సు బార్లలోనే కాదు భీవండి, థానే తదితర ప్రాంతాల్లోని డాన్సు బార్లలో కూడా అచ్చంగా అదే తరహాలో సమాంతర కరెన్సీ రాజ్యములుతుంది. ఇది చట్ట వ్యతిరేకమైనా.. అక్కడ మాత్రం చెల్లబాటు అవుతుంది. డాన్స్ బార్లలో అక్రమ ముఠాలు సమాంతర కరెన్సీని యదేశ్ఛగా వినియోగిస్తున్నా.. మహారాష్ట్ర పోలీసుల మాత్రం చేష్టలుడికి చూస్తున్నారని అరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles