విత్ డ్రా పరిమితి కుదింపు.. పాత నోట్ల మార్పిడి రద్దు.. banks cut withdrawal limit

Banks cut withdrawal limit on savings and current account

Currency ban, Notes Ban, demonetisation, withdrawal limit, currency exchange, Prime Minister Narendra Modi, demonetisation, parliament session, congress, rbi rules, pm modi demonetisation, demonetisation rules, atm withdrawal charges, atm withdrawal limits, india news

Without any offical announcement from Reserve bank of India, banks are forced to cut withdrawl limit

విత్ డ్రా పరిమితి కుదింపు.. త్వరలో అధికారిక ప్రకటన

Posted: 11/25/2016 10:00 AM IST
Banks cut withdrawal limit on savings and current account

అవినీతిపై అలుపెరుగని పోరాటంలో భాగంగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికే విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకున్న పాపాన పోవడంలేదు. ఇటు ప్రజల్లో కూడా పెద్ద నోట్ల రద్ద తరువాత ఉత్పన్నమవుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ఏటీయంలు, బ్యాంకుల వద్ద క్యూ లైన్లలో నిలబడి అవస్థలు పడుతున్న ప్రజలకు కేంద్ర మరో గుదిబండలాంటి నిర్ణయం శారఘాతంలా పరిణమించింది.

నోట్ల మార్పడితో బ్యాంకుల వద్దకు వెళ్తున్న ప్రజల తాకిడి దేశంలోని అర్బీఐ ఉప కార్యాలయాల్లో వున్న డబ్బే సరిపోక నో క్యాష్ బోర్డులు దర్శమిస్తున్నాయి. ఇటు పలు ప్రవైటు బ్యాంకులు కూడా తమకు అర్భీఐ నుంచి రావాల్సిన డబ్బు అందక అదే తరహాలో డబ్బులు లేవు అన్న బోర్డులు పెడుతున్న తరుణంలో.. ప్రజలకు సరిపడా డబ్బును అందించలేని ప్రభుత్వంపై విమర్శలు, శాపనార్థాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం పలు సవరణ చర్యలను చేపట్టింది.

అయితే ప్రజలకు సరిపడా డబ్బులును ఇవ్వాల్సిన ప్రభుత్వం.. వాటిని జారీ చేయడంలో విఫలం కాగా, ఇటు ఖాతాదారుల విత్ డ్రా పరిమితిలలో కూడా బాగా కుదింపును చేసింది. ప్రస్తుతం వున్న విత్ డ్రా పరిమితులను ఘోరంగా తగ్గించి.. ప్రజల నుంచి భారీ ఎత్తున విమర్శలను ఎదుర్కోంటుంది. వారానికి ఇప్పటివరకూ రూ.24వేలుగా ఉన్న పరిమితి రూ.5వేలకు కుదించినట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. కరెంట్ ఖాతాదారులకు మాత్రమే రూ.25వేలు డ్రా చేసుకునే వెసులుబాటు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఈ మేరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇవాళ ఈ మేరకు ప్రకటన వెలువడుతుందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles