లవ్ జిహాద్ పేరిట భజరంగ్ దళ్ దౌర్జన్యం.. Bajrang Dal goons mercilessly thrashing Muslim couple

Bajrang dal goons brutally beating muslim couple in bundalshahr u p

Bajrang Dal, Bulandshahr, Love Jihad, Muslims, Thrash, Hindutva brigade, Muslim couple, Love affair, Hindu Girl, Muslim boy

Hindutva brigade goons attacked the couple seems to be in an impression that the man in question was a Muslim, having love affair with a Hindu girl giving it a Love Jihad angle.

ITEMVIDEOS: లవ్ జిహాద్ పేరిట భజరంగ్ దళ్ దౌర్జన్యం..

Posted: 11/24/2016 06:36 PM IST
Bajrang dal goons brutally beating muslim couple in bundalshahr u p

లవ్ జిహాద్ ఈ తరహాలో ప్రచారం చేసి ఆ మధ్య ఉత్తర్ ప్రదేశ్ లో పలువురిపై దాడులకు పాల్పడ్డారు. ఇక బీజేపికి గురువులాంటి సంస్థగా పేర్కోంటున్న అర్ఎస్ఎస్ కూడా ఆ మధ్య లవ్ జిహాద్ ప్రచారాన్ని చేసింది. ఏకంగా కరినాకపూర్ ఫోటోను కవర్ పేజీపై ముద్రించి.. ఆమె కూడా లవ్ జిహాద్ లో చిక్కకుందని కథనాన్ని ప్రచురించింది. ఆ తరువాత కనుమరుగైన ఈ లవ్ జిహాద్ ప్రచారం మళ్లీ ఉత్తర్ ప్రదేశ్ లో వార్తల్లో నిలిచింది.

ఈ తరహా పుకార్లతో ఓ ముస్లిమ్ యువదంపతులపై భజరంగ్ దళ్ కార్యకర్తలు అమానుషంగా దాడి చేశారు. ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ జిల్లా ఖుర్జాలో ఓ ముస్లిమ్ యువకుడు హిందూ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, లవ్ జిహాద్ అనే అభిప్రాయంతో హిందూత్వ బ్రిగేడ్ కు చెందిన కార్యకర్తలు కర్రలతో ఆ ముస్లిమ్ దంపతులపై దాడి చేశారు. రక్తం ఒడుతున్నా.. కనీస కనికరం కూడా లేకుండా దంపతులపై కర్రలతో దాడి చేశారు. మహిళ అన్న విఛక్షణ కూడా లేకుండా అమెను కూడా దారుణంగా కొట్టారు.

ఈ ఘటన సమాచారంతో రంగంలోకి దిగిన బులంద్ షహర్ పోలీసులు దంపతులపై దాడి చేసిన భజరంగ్ దళ్ కు చెందిన 20 మంది నిందితులపై కేసును నమోదు చేశామని చెప్పారు. వారిపై ఐపీసీ 147,148,149,323, 307,342, 354, 452,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు. దాడి కేసులో నిందితులైన భజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ తో సహా ఐదుగురిని అరెస్టు చేశామని ఖుర్జా పోలీసు అధికారి చెప్పారు. నిందితుల్లో భజరంగ్ దళ్ స్థానిక కన్వీనర్ తో సహా ప్రవీణ్ భాటి, పుష్పేంద్ర చౌదరి, తాను సోలంకి, సోను, నితిన్ లున్నారని పోలీసులు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bajrang Dal  Bulandshahr  Love Jihad  Muslims  Thrash  

Other Articles