ప్రధాని మోదీ టార్గెట్ గా పేలిన షాట్ గన్ fools paradise and planted surveys shatrugan sinha vs bjp again

Fools paradise and planted surveys shatrugan sinha vs bjp again

Shatrughan Sinha, currency ban, Fools Paradise, Union government, Currency exchange, demonetisation, RBI, parliament session, congress, pm modi, demonetisation, demonetisation rules, rbi demonetisation, atm demonetisation, atm withdrawal charges, india news

Let's stop living in a fools' paradise and getting carried away by planted stories & surveys conducted by vested interests," tweeted Mr Sinha, former actor and senior Bihar leader

ప్రధాని మోదీ టార్గెట్ గా పేలిన షాట్ గన్

Posted: 11/24/2016 03:33 PM IST
Fools paradise and planted surveys shatrugan sinha vs bjp again

అవినీతిపై పోరాటంలో భాగంగా కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకన్న చారిత్రక నిర్ణయం పెద్దనోట్ల రద్దుపై బీజేపి పాలిత రాష్ట్రాలు, ఎంపీలు ప్రశంసలు కురిపిస్తున్న తరుణంలో.. పార్టీలోని షాట్ గన్ గా పేరొందిన అసమ్మతి ఎంపీ, మాజీ నటుడు శత్రుఘ్నసిన్హా మాత్రం వారందరికీ భిన్నంగా స్పందించారు. ఏకంగా ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేసుకుని బుల్లట్ల లాంటి విమర్శలు సంధించారు. క్రితం రోజు రాత్రి తన క్యాబినెట్ సమావేశంలో తన నిర్ణయంపై ప్రత్యేక యాప్ ద్వారా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.

సుమారుగా ఐదు లక్షల మంది పాల్గోన్న ఈ సర్వేలో నూటికి 93శాతం మంది తమ నిర్ణయానికి మద్దతు పలికారని చెప్పి 12 గంటలు కూడా గడవకముందే శత్రుఘ్న సిన్హా వాటిని టార్గెట్ చేశారు. ప్రధాని సహా బీజేపి నేతలు పిచ్చోళ్ల స్వర్గంలో విహరించవద్దని, భ్రమల్లో బతకొద్దని పరోక్షంగా సూచించారు. నోట్ల రద్దుకు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చారన్న మోదీ వ్యాఖ్యలను శత్రుఘ్నసిన్హా తప్పుబుడతూ.. ఇలాంటి కల్పిత కథనాలు, కట్టు కథలతో మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామని, అయితే స్వప్రయోజనాల కోసం నిర్వహించిన సర్వేలకు దూరంగా ఉంటేనే అసలు విషయాలు మన దృష్టికి వస్తాయని అన్నారు.

మొబైల్‌ యాప్ ద్వారా నిర్వహించిన సర్వేలో 93 శాతం మంది పెద్దనోట్ల రద్దుకు మద్దతిచ్చారని, కేవలం 2 శాతం మంది మాత్రమే దాన్ని వ్యతిరేకించారన్నారని ప్రధాని మోదీ బుధవారం వెల్లడించారు. అయితే మోదీ సర్కారు తమకు అనుకూలంగా ఈ సర్వే చేయించుకుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. గ్రామీణ భారతానికి ఈ సర్వేలో ప్రాతినిథ్యం లేదని వ్యాఖ్యానించాయి. గ్రామాల్లో చాలా మందికి స్మార్ట్‌ ఫోన్లు లేవని తెలిపాయి. తమకు వ్యతిరేకంగా వచ్చిన సమాధానాలను ప్రభుత్వం తొలగించిందని ఆరోపించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shatrughan Sinha  currency ban  Fools Paradise  Union government  demonetisation  RBI  

Other Articles