చావు లెక్కల్లో కూడా వంకర బుద్ధేనా? | Pakistan says three of its soldiers killed in cross border firing.

Pak claims just three soldiers killed in exchange of fire

Pakistan cease fire, Indian troops firing, Machal sector, Machal sector attack revenge, India revenge attack Pak, Pak soldiers killed, Pak Civilians killed in Indian Army attack

Indian Army kills 9 Pak soldiers in exchange of fire, But, Pak claims that only three soldiers martyred.

చావుల్లో కూడా పాక్ దొంగ లెక్కలు

Posted: 11/24/2016 09:15 AM IST
Pak claims just three soldiers killed in exchange of fire

రెండు రోజుల క్రితం పాక్ చేసిన దుశ్చర్యపై భారత సైన్యం ఇంకా రగిలిపోతూనే ఉంది. మచ్చల్ సెక్టార్ లో ఒక జవాన్ ను కిరాతకంగా ముక్కలుగా నరికి, మరో ఇద్దరిని కాల్చి చంపిన ఘటన తెలిసిందే. అన్న మాట ప్రకారం రంగంలోకి దిగిన ఆర్మీ పాక్‌పై భార‌త్ ప్రతీకారం తీర్చుకుంది.

అమ‌రులైన జ‌వాన్లు మ‌నోజ్ కుమార్ కుశ్వాహ‌, ప్ర‌భుసింగ్‌, శ‌శాంక్ కుమార్‌లకు సైన్యం నివాళులు అర్పించిన కొద్ది గంటల్లోనే పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లోని పాక్ పోస్టులపై భీక‌ర కాల్పుల‌తో పాక్ వెన్నులో వ‌ణుకు పుట్టించింది. 2003 తర్వాత నియంత్రణ రేఖ వెంబడి ఈ రేంజ్ లో దాడులు జరగటం ఇదే మొదటిసారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 120 ఎంఎం మోర్టార్లు, మిష‌న్ గ‌న్ల‌తో పాక్ జ‌వాన్ల‌ను బెంబేలెత్తించింది.

తాజాగా అందిన సమాచారం ప్రకారం భార‌త్ జరిపిన దాడుల్లో 9 మంది పాక్ జ‌వాన్లు హ‌త‌మ‌య్యారని సమాచారం. వీరిలో ఓ కెప్టెన్‌స్థాయి అధికారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మచ్చల్ దాడికి ప్ర‌తీకారం తీవ్రంగా ఉంటుంద‌ని భార‌త్ అప్పుడే హెచ్చ‌రించింది. అనుకున్న‌ట్టుగానే పాక్ పోస్టుల‌పై భీక‌ర కాల్పుల‌తో విరుచుకుప‌డింది.

అయితే భార‌త్ కాల్పుల్లో ముగ్గురు జ‌వాన్లు, మ‌రో ప‌దకొండు మంది పౌరులు అమరులయ్యారని పాక్ ప్ర‌క‌టించింది. ఓ బస్సుతోపాటు, అంబులెన్స్ పై భారత దళాలు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపాయని, దాడిలో మోటర్ బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి కూడా మరణించాడని పాక్ అధికార వర్గాలు చెబుతున్నాయి. భారత్ కాల్పుల‌ను స‌మ‌ర్థంగా తిప్పికొట్టామ‌ని, త‌మ దాడుల్లో ఏడుగురు భార‌త సైనికులు మృతి చెందార‌ని పాక్ ప్ర‌క‌టించింది. త‌మ‌వైపు నుంచి ఎటువంటి క‌వ్వింపు చ‌ర్య‌లు లేకుండానే భార‌త్ కాల్పుల‌కు పాల్ప‌డింద‌ని ఆరోపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  India  Cease Fire  Exchange of fire  

Other Articles