మాజీ సీఎం డబ్బుతో డ్రామాలాడారా? | Curious case of the vanishing Rs 3.5 crore seized at Nagaland airport.

Nagaland mp s son in law in money laundering

Lok Sabha MP, Neiphiu Rio, Anato Zhimomi, Nagalamd MP, Anato Zhimomi 3.5 crores, Anato Zhimomi Money Laundering, Nagaland Ex Chief Minister, missing Rs 3.5 crore, Nagaland Lok Sabha MP

Rs 3.5 crore seized in Nagaland linked to ex-CM goes missing.

ఆ మూడున్నర కోట్లు ఎలా మాయం అయ్యాయి?

Posted: 11/24/2016 08:18 AM IST
Nagaland mp s son in law in money laundering

లెక్క పక్కా లేని పాత 500, 1000 రూపాయలతో కూడిన ఓ బ్యాగ్ ను అధికారులు పట్టేసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా మంగ‌ళ‌వారం నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో ఓ చార్ట‌ర్డ్ విమానంలో దీనిని తరలించాలని చూశారు. అయితే సీజ్ చేశామని అధికారులు అధికారికంగానే ప్రకటించినప్పటికీ ఆ తర్వాతే అసలు డ్రామా మొదలైంది. నోట్ల క‌ట్ట‌లు బుధ‌వారం నుంచి క‌నిపించ‌కుండా పోవ‌డంతో క‌ల‌క‌లం రేగింది.

దీంతో రంగంలోకి దిగిన నాగాలాండ్ పోలీసులు వివరణ ఇచ్చుకున్నారు. సీజ్ చేసిన డబ్బును సీఐఎస్ఎఫ్ అధికారులు ఆదాయ పన్నుల శాఖ(ఐటీ) అధికారులకు అప్ప‌గించారని పోలీస్ చీఫ్ ఎల్ ఎల్ డౌంగెల్ తెలిపారు. నాగాలాండ్ వ్యాపారవేత్త అనాటో ఝిమోమీ ఆ డ‌బ్బుల‌కు సంబంధించిన ఐటీ లెక్క‌లు చూప‌డంతో ఆ సొమ్మును తిరిగి ఇచ్చేసిన‌ట్టు ఆయ‌న వివ‌రించారు.

ముందుగా డ‌బ్బులు తీసుకెళ్లిన ఆయ‌న ఆర్జీటీఎస్ ద్వారా వాటిని ఓ వ్యాపార‌వేత్త‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన‌ట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఝిమోమీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై లెక్కలు సరిగ్గా ఉండటంతోనే విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

నాగాలాండ్ గతంలో మూడు సీఎంగా పనిచేసి, ప్రస్తుతం ఆ రాష్ట్రం నుంచి ఏకైక ఎంపీగా ఉన్న నీఫియు రియో(బీజేపీకి మద్ధతు) అల్లుడే అనాటో ఝిమోమీ. ప్రస్తుత వ్యవహారంతో మ‌నీలాండ‌రింగ్ రాకెట్ ఉన్న‌ట్టు గుర్తించిన అధికారులు ఝిమోమీని అదుపులోకి తీసుకుని, ఆపై విడుదల చేశారు. ఈ మొత్తం వ్య‌వ‌హారం వెన‌క ప‌లువురు వ్యాపార‌వేత్త‌లు ఉన్న‌ట్టు ద‌ర్యాప్తులో వెల్ల‌డైంది. ఇప్ప‌టి వ‌రకు మూడుసార్లు అదే విమానంలో డ‌బ్బుల‌ను త‌ర‌లించిన‌ట్టు ఝిమోమీ అంగీకరించిన‌ట్టు ఐటీ అధికారులు తెలిపారు. కాగా, అనాటో ఝిమోమీ తండ్రి కూడా గతంలో రాజ్యసభ నాగా పీపుల్స్ ఫ్రంట్ పార్టీ తరపున పనిచేశాడు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh