బీజేపీకి, ఆప్ కి కామన్ షాకిచ్చిన సిద్ధూ వైఫ్ | Navjot Kaur To Formally Join Congress On November 28

Sidhu s wife navjot kaur to join congress

Navjot Kaur, Navjot kaur sidhu, Navjot singh sidhu, Navjot singh sidhu wife, Sidhu wife Congress, Congress Punjab election, Pargat Singh, Awaaz E Punjab, BJP MLA Navjot Kaur Sidhu

Navjot Kaur Sidhu, Pargat Singh will join Congress on Nov 28.

బీజేపీకి బిగ్ షాకిచ్చేసిన సిద్ధూ భార్య

Posted: 11/24/2016 09:37 AM IST
Sidhu s wife navjot kaur to join congress

పంజాబ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీజేపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మరీ సొంతగా ఆవాజ్ ఈ పంజాబ్ పార్టీని స్థాపించుకున్నాడు మాజీ క్రికెట్ర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ. అయితే ఆయన భార్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని వీడేది లేదని ఆ సమయంలో ప్రకటించింది కూడా. కానీ, ఇప్పుడు నవజ్యోత్ కౌర్ పెద్ద షాకే ఇవ్వబోతుంది.

ఈ నెల 28న అధికారికంగా ఆమె కాంగ్రెస్ చేరనున్నట్లు సమాచారం. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరిందర్ సింగ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆవిడతోపాటు మాజీ హాకీ కెప్టెన్, అవాజ్-ఈ-పంజాబ్ లో కీలకనేతగా ఉన్న ప్రగత్ సింగ్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారంట. సిధ్దూ వైప్ అకాలీదళ్-బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగానే కాదు, ప్రస్తుతం అమృత్ సర్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు.

బీజేపీకి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్, తన భర్త వ్యవస్థాపకుడిగా ఉన్న ఆవాజ్-ఏ-హింద్ ను కాదని మరీ, కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకోవటం ఆసక్తికరంగా మారింది. ఇక భావ సారూప్యత ఉన్న నవజ్యోత్ వంటి వారిని తమ పార్టీ అక్కున చేర్చుకుంటుందని, వారి రాకతో, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మరింత బలపడిందని అమరిందర్ సింగ్ పేర్కొన్నాడు.

కాగా, జూలైలో బీజేపీ కి గుడ్ బై చెప్పిన సిద్ధూ సెప్టెంబర్ లో ఆవాజ్-ఈ-పంజాబ్ ను పార్టీని పెట్టిన సిద్ధూ, ఆపై ఎన్నికలే తమ లక్ష్యమని ఓసారి, ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని మరోసారి వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు నవజ్యోత్ తరువాత, సిద్ధూ కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా సిద్ధూని లాగి పంజాబ్ ఎన్నికల్లో లాభపడుదామనకున్న ఆప్ కి ఇది పెద్ద షాకే అని చెప్పుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Awaaz E Punjab  Navjot singh sidhu  wife  BJP MLA Navjot Kaur Sidhu  Congress  

Other Articles