కేసీఆర్ కొత్త ఇంట్లో అడుగుపెట్టాడు | Telangana CM KCR new house has state of the art facilities

Cm kcr new house warming ceremony held

Telangana chief minister, K Chandrasekhar Rao, KCR New House, KCR house warming, Telangana New CM Camp Office, Telangana chief minister Camp Office, Telangana Old Camp Office, Telangana CM new House, Chinna Jeeyar Swamy KCR House, KCR New House Chinna Jeeyar

Telangana chief minister KCR Inaugurates New CM Camp Office

ITEMVIDEOS:తెలంగాణ సీఎం కొత్త క్యాంప్ ఆఫీస్ ప్రారంభం

Posted: 11/24/2016 07:45 AM IST
Cm kcr new house warming ceremony held

తెలంగాణ రాష్ట్రానికి సీఎం నూతన అధికారిక నివాస కార్యాలయం కాసేపటి క్రితం ప్రారంభమైంది. గురువారం తెల్ల‌వారుజామున 5.22 గంట‌ల‌కు ముఖ్యమంత్రి కే, చంద్రశేఖర్ రావు దంపతులు దంపతులు నూత‌న గృహ ప్ర‌వేశం చేశారు. వేద‌పండితులు నిర్ణ‌యించిన ముహూర్తంలో ఆయ‌న నూత‌న గృహంలోకి ప్ర‌వేశించారు. ఈ కార్య‌క్ర‌మానికి చిన‌జీయ‌ర్ స్వామి స‌హా ప‌లువురు మంత్రులు, ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

38 కోట్ల రూపాయ‌ల అంచ‌నాల‌తో మూడు బ్లాకులుగా నిర్మాణం చేప‌ట్టారు. ఐదు భ‌వ‌నాల స‌ముదాయానికి(నివాసం, కార్యాలయాలకు) 'ప్ర‌గ‌తి భ‌వ‌న్‌'గా నామ‌క‌ర‌ణం చేశారు. ప్రాంగ‌ణ‌మంతా ప‌చ్చ‌ద‌నంతో వెల్ల‌విరిసేలా వివిధ మొక్క‌లు నాటారు. ఏక‌కాలంలో వెయ్యిమందితో స‌మావేశ‌మ‌య్యేలా మరో భవనాన్ని తీర్చిదిద్దారు. స‌మావేశ మందిరానికి 'జ‌న‌హిత' అనే పేరు పెట్టారు. రైతులు, కార్మికులు, ఉద్యోగులు ఎవరితోనైనా మీటింగ్ జరపుకునేలా దీనిని నిర్మించారు.

 

చిన్నజీయర్ స్వామి ముందుండి కేసీఆర్ దంపతులు వెనుక నడిచారు. మొత్తం ప్రాంగణం అంతా స్వయంగా కేసీఆర్ దగ్గరుండి మరీ తిప్పి స్వామిజీకి చూపించాడు. నేటి నుంచే ఈ కార్యాలయం పనులు చేయటం ప్రారంభిస్తుంది. ఈ దశలో పాత క్యాంపు కార్యాలయంను ఏం చేస్తారన్నది తెలియాల్సి ఉంది. 

కొత్త ఇంటి విశేషాలు...

ప్రగతి భవన్ పేరిట తెలంగాణ సీఎం కేసీఆర్, సతీమణి శోభతో కలిసి కొత్త ఇంట్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. చిన్నజీయర్ స్వామిజీ దగ్గరుండి మరీ పూజా కార్యక్రమాలు నిర్వహించి ముందుండి మరీ ఇంట్లో అడుగుపెట్టించాడు. మొత్తం లక్షకు పైగా స్క్వేర్ ఫీట్లు ఉండగా, అందులో నివాస సముదాయం 40,000 స్క్వేర్ ఫీట్లతో రెండంతస్థులు, క్యాంప్ ఆఫీస్ మరియు జనహిత(సమావేశాల సముదాయం) 50,000 స్క్వేర్ ఫీట్లు ఉండటం గమనార్హం.

new camp office

KCR camp office

KCR new office

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana CM KCR  New Camp Office  House Warming  Chinna Jeeyar Swamy  

Other Articles