బాహుబలి లీక్ లో నిందితుడి అరెస్ట్ | Man arrested in Baahubali 2 scene leakage.

Man behind baahubali 2 video leak arrest

Baahubali 2, Baahubali 2 scene leak, man arrest in Baahubali 2 leakage, baahubali 2 leak scene, Graphics helper arrested, Baahubali graphics team leak photos

Baahubali 2 war scene leaked in online later disappear, man behind it arrested.

బాహుబలి-2 లీకు వీరుడి అరెస్ట్

Posted: 11/22/2016 03:07 PM IST
Man behind baahubali 2 video leak arrest

బాహుబలి-2 సన్నివేశాల లీక్ వ్యవహారం ఒక్కసారిగా కలకలం రేపిన విషయం తెలిసిందే. రెండు నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమై కలకలం రేపింది. ఆ వీడియోలో అమరేంద్ర బాహుబలి, దేవ సేన కలిసి యుద్ధ సన్నివేశంలో ఉండటం, బందిపోటు వీరయ్య(అజయ్ ఘోష్) బ్యాచ్ తో పోరాటం చేసే సన్నివేశాలు అందులో ఉన్నాయి.

తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే.. మొత్తం 9 నిమిషాల నిడివి ఉన్న వీడియో లీకైందంట. చిత్రానికి గ్రాఫిక్స్ సాయకుడిగా పని చేసిన వ్యక్తే ఈ పని చేసినట్లు తెలుస్తోంది. ఇక నిందితుడు కృష్ణను విజయవాడలో మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న సన్నివేశం లీకైన వెంటనే అప్రమత్తమైన చిత్ర నిర్మాతలు జూబ్లిహిల్స్ స్టేషన్ లోనూ, ఆపై సైబర్ సెల్ లోనూ ఫిర్యాదు చేసి, ఆపై వీడియోను డిలేట్ చేయించారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : baahubali 2  scenes leak  man arrest  

Other Articles