ట్రంప్ నచ్చకపోతే దేశం విడిచి వెళ్లిపోవాల్సిందేనా? | If you don’t like Donald Trump leave the country.

If you don t like donald trump leave the country

Judge John Primomo, don’t like Donald Trump, Donald Trump, Federal judge supports Trump, Trump John Primomo, US new President, Donald Trump

Judge John Primomo, a federal magistrate judge in San Antonio, Texas, says If you don’t like Donald Trump leave the country.

ట్రంప్ నచ్చలేదా? అయితే ఆ పని చేయండి

Posted: 11/22/2016 04:24 PM IST
If you don t like donald trump leave the country

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎంపిక కావటం ఒక ఎత్తు అయితే, ఎన్నికయ్యాక దానికి వ్యతిరేక గళం వినిపిస్తున్నవారి సంఖ్య రాను రాను పెరిగిపోతుంది. సోషల్ మీడియా దగ్గరి నుంచి ప్రజలు, ముఖ్యంగా యూత్ రోడ్ల మీదకి చేరి ఈ కంపు ట్రంప్ మాకొద్దు అంటూ నిరసనలు చేపడుతున్నారు. ఈ అల్లర్లు ఎంతకీ చల్లారకపోవడంపై ఓ జడ్జి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫెడరల్ కోర్టు జడ్జి జాన్ ప్రిమోమో ట్రంప్ మీకు నచ్చకపోతే ఓ పని చేయాలంటూ తీవ్రంగా స్పందించారు.

ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇష్టం లేకపోతే దేశం విడిచి వేరే దేశానికి వెళ్లవచ్చని నిరసనకారులకు సూచించారు. ట్రంప్‌ కు ఓటు వేసినా, వేయకపోయినా నిరసనకారులంతా యూఎస్‌ సిటిజన్స్‌ అని, అమెరికా అధ్యక్షుడు ట్రంపేనని ఆయన స్పష్టం చేశారు. శాన్ ఆంటోనియోలో జరిగిన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్సస్ కల్చరల్స్ లో అమెరికా పౌరసత్వం స్వీకరించిన వారినుద్దేశించి ఆయన పై వ్యాఖ్యలు చేశాడు.

ఆందోళన చేసే హక్కు మీకు ఉంది కానీ జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని అవమానించే హక్కు లేదని, జాతీయ గీతం వస్తుండగా నిలబడకుండా మోకాలిపై కూర్చున్న క్రీడాకారులను ఆయన మందలించారు. అధ్యక్ష పదవిపై ఉన్న గౌరవంతోనే తానీ మాటలు చెబుతున్నాని ఆయన చెప్పారు. అయితే చివర్లో తాను తాను ట్రంప్‌ కు ఓటేయలేదని చెప్పటం కొసమెరుపు. ఇక నిరసనకారులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే జాన్ ను ఫెడరల్ న్యాయమూర్తుల బోర్డు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donal Trump  Judge John Primomo  support comments  

Other Articles