యాంకర్ వీడియోకి కేటీఆర్ రెస్పాండ్ అయ్యాడు.. అతన్ని అరెస్ట్ చేశారు | KTR respond on man attacks on youth in suryapet.

Ktr respond on man attacks on youth in suryapet

KTR Kavitha Rao, Anchor Kavitha Rao, KTR Jagadish Reddy, Jagadishreddy man attack video, TRS leader attack video, Fake TRS leader, TRS leader attack jobless people

KTR respond on Anchor posted video. Fake TRS leader arrested in Suryapet.

ITEMVIDEOS:ఆ వీడియోతో టీఆర్ఎస్ కి సంబంధం లేదన్న కేటీఆర్

Posted: 11/22/2016 01:23 PM IST
Ktr respond on man attacks on youth in suryapet

అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రభుత్వంపై అవినీతి మకిలి అంటకుండ సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాడు. రాజయ్య పై ఇలా ఆరోపణలు రాగానే, అలా తొలగించేసి భవిష్యత్తులో ఇలాంటి ఆరోపణలు ఎవరి మీద వచ్చిన సహించే ప్రసక్తే లేదని వార్నింగ్ కూడా ఇచ్చేశాడు. ఆపై మరో మంత్రి జగదీష్ రెడ్డిపై కూడా ఇలాంటి వార్నింగ్ లే రావటం, ఆపై ఏం జరిగిందో తెలీదుగానీ అది కాస్త సర్దుమణిగిపోవటం జరిగిపోయింది.

ఇక ఇటీవల ఓ మహిళా జర్నలిస్ట్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేయటం, అది కాస్త సంచలనంగా మారిపోవటం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ నాయకుడిగా చెప్పుకొనే ఓ వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ యువతను మోసం చేయడమే కాకుండా.. ఇద్దరు యువకులను చితకబాదిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌ అయింది. దీంతో రంగంలోకి దిగిన ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి తారకరామారావు స్పందించారు.

 

 

అందులో యువకులను చితకబాదిన సదరు వ్యక్తి టీఆర్‌ఎస్‌ సభ్యుడు కాదని, ఈ విషయాన్ని సూర్యాపేట ఎమ్మెల్యే, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్రువీకరించారని తెలిపారు. సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి విజ్ఞప్తి చేశాడు.

సంతోష్ అనే వ్యక్తి తాను టీఆర్ఎస్ పార్టీ నాయకుడిని, మంత్రి జగదీశ్‌కు అనుచరుడనని చెప్పుకొంటూ గత కొంతకాలంగా మోసాలకు పాల్పడుతున్నాడంట. అంతేకాదు నిరుద్యోగులైన యువకుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసం చేయటం, వారు గట్టిగా అడిగితే చితకబాదటం లాంటివి చేసేవాడని తెలుస్తోంది. వీడియో వెలుగులోకి రావటం, ఆపై మంత్రి సహకారం లేనిదే అతను అంతలా రెచ్చిపోడంటూ వార్తలు రావటంతో కేటీఆర్ చివరకు స్పందించాడు. దీనికి తెలంగాణ డీజీపీ స్పందిస్తూ... కేసు నమోదు చేసుకోవటమే కాదు, అతన్ని అరెస్ట్ కూడా చేసినట్లు తెలిపాడు. దానికి స్పందనగా బాధితులకు న్యాయం జరిగేలా చూడండంటూ మరో ట్వీట్ వేశాడు కేటీఆర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : KTR  Kavitha Rao  Suryapet attack video  Fake TRS leader  

Other Articles