సర్వోన్నతానికి చేరిన ‘నోట్ల రద్దు’ పంచాయితీ.. Supreme Court to hear plea Wednesday on transferring demonetisation cases

Sc to hear plea wednesday on transferring demonetisation cases

supreme court, congress, anand sharma, parliament, banks, ATMs, Rs 500, Rs 1,000, notes exchange, RBI, Rs 2000new Rs 500 notes, Nashik press, Currency Ban, notes ban, Rs 2,000 note, PM Modi, Narendra Modi, Prime Minister, Facebook, Twitter, War on Black Money, BJP, ATM queues, Bank queue, New Currency Notes, Exchange Old Currency Notes

The Supreme Court agreed to hear on November 23 a plea of the Centre seeking transfer of all demonetisation cases to either one high court or the apex court.

సర్వోన్నతానికి చేరిన ‘నోట్ల రద్దు’ పంచాయితీ..

Posted: 11/21/2016 02:07 PM IST
Sc to hear plea wednesday on transferring demonetisation cases

కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం తీసుకున్నసంచలన నిర్ణయంగా పేర్కోంటున్న పెద్దనోట్లను రద్దు కేసులు ఏకంగా సర్వోన్నత న్యాయస్తానానికి చేరాయి. అవినీతి, నల్లధనం, ఉగ్రవాదం తదితర అంశాల నేపథ్యంలో భారత ఏకానమీపై సర్జికల్ స్ట్రైక్ గా పేర్కోంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకిస్తూ న్యాయస్థానాలను అశ్రయించారు. దీంతో దేశవ్యప్తంగా నెలకొన్న గంధరగోళ పరిస్థితిని చక్కదిద్దే బాద్యత ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చేరింది.

నోట్ల రద్దు అంశంమై దాఖలైన కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా చెలామణిలో ఉన్న కరెన్సీలో 80 శాతాన్ని ఒకేసారి రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కొందరు పిటిషన్లు అభ్యంతరం వ్యక్యం చేయగా, మరికొందరు.. బ్యాంకుల ముందు క్యూ లైన్లలో చనిపోయినవారి తరఫున పిటిషన్లు దాఖలుచేశారు. అయితే నోట్ల రద్దు(డీమానిటైజేషన్‌)పై దాఖలైన అన్ని కేసులను కొట్టేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరడం, అందుకు అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించడం తెలిసిందే.

దేశంలోని వివిధ కోర్టుల్లో దాఖలైన పిటిషన్లు అన్నింటినీ ఒకే చోట ఒకే రోజు విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. బుధవారం (నవంబర్‌ 23న) సుప్రీంకోర్టులోగానీ, ఏదేనీ హైకోర్టులో గానీ నోట్ల రద్దు పిటిషన్ల విచారణ జరుపుతామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఈ మేరకు కేసుల బదలాయింపుకు సంబంధించిన పిటిషన్‌ ను కేంద్ర అటార్నీ జనరల్‌ చేతే దాఖలు చేయించింది. ఏజీ రోహత్గీ.. ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ ను కలిసిన సంబంధిత పిటిషన్లను అందజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : supreme court  banks  ATMs  Rs 500  Rs 1  000  Queues  demonetisation  Reserve bank of India  

Other Articles