గాలి పెళ్లిలో సందడి చేసిన సెలబ్రిటీలు వీరే.. | Celebs Graced Gali Janardhan Reddy Daughter's wedding.

Celebs graced gali janardhan s daughter marriage

Gali Janardhan Reddy Daughter, Brahmani’s Marriage, Gali Janardhan Reddy Daughter Brahmani, Gali Wedding, Celebrities at Brahmani’s Marriage, Celebrities at Gali Janardhan Reddy Daughter wedding

Celebs Graced Gali Janardhan Reddy Daughter Brahmani’s Marriage.

గాలి పెళ్లికి సెలబ్రిటీల లిస్ట్ పెద్దదే...

Posted: 11/17/2016 10:03 AM IST
Celebs graced gali janardhan s daughter marriage

కర్ణాటక బీజేపీ నేత గాలి జనార్దన్‌రెడ్డి ఇంట్లో బుధవారం బాజాలు మోగిన విషయం తెలిసిందే. జనార్దన్‌రెడ్డి కూతురు బ్రాహ్మణికి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రాజీవ్‌రెడ్డితో బెంగళూరులో అంగరంగవైభవంగా వివాహం జరిగింది. అక్రమ మైనింగ్ కేసులు ఎదుర్కొంటున్న జనార్దన్‌రెడ్డి ఇంటి వివాహానికి హాజరు కావొద్దంటూ పార్టీ నేతలను బీజేపీ అధిష్ఠానం ఆదేశించిందని వదంతులు వచ్చాయి. అయితే, వివాహానికి హాజరయ్యే విషయంలో తమపై పార్టీనుంచి ఎటువంటి ఒత్తిడి లేదని ఇంతకుముందే యడ్యూరప్ప మీడియాకు వివరణ ఇచ్చారు.

కాగా, మంగళవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంతోపాటు బుధవారం ఉదయం జరిగిన వివాహ మహోత్సవానికి కూడా యడ్యూరప్ప హాజరయ్యారు. వివాహానికి వచ్చిన ప్రముఖుల్లో కేంద్రమంత్రి సదానందగౌడ ఆయన సతీమణి, కర్ణాటక గవర్నర్ విజుభాయ్ వాలా, బీజేపీ ఎంపీ శోభా, ఎమ్మెల్యే సీటీ రవి, మాజీ సీఎం జగదీశ్ షట్టర్, మాజీమంత్రి సుబ్రమణ్యనాయుడు, బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా, ఎమ్మెల్సీ కొండయ్య, ఎంపీ అనంతవెంకట్రామిమారెడ్డి, ఆరెస్సెస్ నేత ప్రభాకర్ భట్, కాంగ్రెస్ నేత అంబరీశ్, ఆయన సతీమణి సుమలత, మంత్రులు పరమేశ్వర, డీకే శివకుమార్, రామలింగారెడ్డి, ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు.

ఇక సినీ ప్రముఖులు జయంతి, బుల్లెట్‌ప్రకాశ్, సరోజాదేవీ, బసవరాజ్ బొమ్మై, లక్ష్మణ్, యశ్, పునీత్ రాజ్‌కుమార్, రవిచంద్రన్, శరత్‌బాబు, బ్రహ్మానందం, సుమన్ తల్వార్, కోలీవుడ్ హీరో విశాల్, టాలీవుడ్ క్వీన్ రకుల్ ప్రీత్.. ప్రియమణి.. స్నేహ.. మీనా.. రాధిక.. లాంటి వారెందో హాజరయ్యారు. ఇక.. కమెడియన్లకు కొదవ లేకుండా పోయిందని చెబుతున్నారు. జబర్దస్త్ స్కిట్లతో పెళ్లి మండపం మొత్తం నవ్వులు పువ్వులయ్యయని చెబుతున్నారు. పేరు మోసిన సింగర్స్ హిందీ.. కన్నడ.. తెలుగు పాటల్ని పాడి అలరిస్తే.. పెళ్లి సందర్భంగా వేసిన సెట్టింగ్స్.. ఏర్పాటు చేసిన విందు మొత్తం గాలి రేంజ్ ను చూపించాయట. మొత్తం 50,000 మంది అతిథులు హాజరయినట్లు, 100 కోట్లు ఖర్చయినట్లు(ఓవరాల్ గా 590 కోట్లు) జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gali Janardhan Reddy  Daughter  Brahmini's wedding  Celebrities  

Other Articles

Today on Telugu Wishesh