పాత నోట్ల మార్పిడిపై సీరియస్ కండిషన్ | Limit on cash exchange with old notes.

Daily cash exchange limit cut to rs 2000

500, 1000 notes Exchange limit, old notes exchange limit, 4,500 to Rs 2000, Economic Affairs secretary Shaktikanta Das, Shaktikanta Das, Withdrawal limit, Notes Exchange milmit

500, 1000 notes Exchange limit to reduce from Rs 4,500 to Rs 2000 from November 18.

పాత నోట్లతో నకరాలు ఇక చెల్లవ్...

Posted: 11/17/2016 11:09 AM IST
Daily cash exchange limit cut to rs 2000

ప్రజలు ఇబ్బందులు పడకుండా విత్ డ్రా కోసం, డిపాజిట్ కోసం రోజు రోజుకీ నిబంధనలు సడలిస్తూ వస్తున్న కేంద్రం ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఇకపై నగదు మార్పిడి పరిమితిని 2000 రూపాయలకు చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఆర్థిక కార్యదర్శి శక్తికాంతదాస్ కాసేపటి క్రితం మీడియా సమావేశంలో ఈ విషయాన్ని తెలియజేశారు. గతంలో పరిమితి 4000 ఉండగా, దానిని 4500 కు పెంచారు. మళ్లీ ఇప్పుడు దానిని ఏకంగా 2000 లకే తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 18 అంటే శుక్రవారం నుంచి ఈ నిబంధన అమలులోకి రానుంది.

మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావటంతో విత్ డ్రా లో కాస్త వెసులుబాటు కలిగించింది. కుటుంబంలో ఎవరి అకౌంట్ నుంచైనా సరే 2లక్షల 50 వేల రూపాయలను విత్ డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించింది. అయితే అందుకు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి ఆపై నగదు విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది.

ఇక బుధవారం నుంచే కొన్ని బ్యాంకులు కుడి చేతిపై ఇంకు మార్కులను వేయటం ప్రారంభించాయి. నోట్ల మార్పిడి కోసం వచ్చినవారే వస్తున్నారని ఫిర్యాదులు రావటంతో ఈ చర్యను ప్రారంభించింది. కాగా, ఇప్పటిదాకా 5 లక్షల కోట్ల డబ్బు డిపాజిట్ అయినట్లు ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Notes Exchange Limit  500  1000 notes Exchange  4  500 to Rs 2000  

Other Articles