ముద్రగడ పాదయాత్ర: పోలీసుల శాంతిభద్రతలు భేష్..! Mudragada House Arrest amid High Court Green Signal

Mudragada house arrest amid high court green signal

mudragada padmanabham, mudragada padayatra, mudragada satyagraha yatra, AP HIgh Court, public interest litigation, mudragada pil, kapu satyagraha yarta, high court, chinna rajappa, chandrababu, AndraPradesh

Kapu leader Mudragada Padmanabham’s six- day padayatra is stopped by AP police even after High Court issuing green signal and he is been house arrested at Ravulapalem in East Goavari district

ముద్రగడ పాదయాత్ర.. పోలీసుల శాంతిభద్రతలు భేష్..!

Posted: 11/16/2016 10:44 AM IST
Mudragada house arrest amid high court green signal

కాపు హక్కుల సాధనే కోసం ఉద్యమిస్తున్న కావు ఐక్యవేదిక ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన సత్యాగ్రహ పాదయాత్రకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రేకులు వేయించింది. కాపు కులస్థులను బీసీలలో చేర్చి.. ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇవాళ్టి నుంచి ఆయన సాగించనున్న సత్యాగ్రహ పాదయాత్రలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అవుతుందన్న కారణంగా పోలీసులు అయనను హౌజ్ అరెస్టు చేశారు.

ఈ మేరకు ఆయన సత్యాగ్రహ పాదయాత్రపై దాఖలైన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటీషన్ దాఖలు కాగా.. దానిపై విచారించిన రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు పచ్చజెండాను ఊపినా.. పోలీసులు బ్రేకులు వేయడంపై తీవ్ర అభ్యంథరాలు వ్యక్తం అవుతున్నాయి. ముద్రగడ సత్యాగ్రహ పాదయాత్ర చేసినంత మాత్రాన శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించినా.. పోలీసులు అయన పాదయాత్రకు సహకరించి ఎలాంటి విఘాతాలు ఏర్పడకుండా చూడాల్సంది పోయి.. ఆయననే గృహనిర్భంధలో చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముద్రగడ పద్మనాభం తూర్పు గోదావరి జిల్లా రావుల పాలెం నుంచి తలపెట్టిన ‘కాపు సత్యాగ్రహ యాత్ర’ ఇవాళ ప్రారంభం కావాల్సివుంది. ఇది ఐదురోజుల పాటు కొనసాగి అంతర్వేదిలో ముగియాల్సి వుందిజ అయితే ఈ నేపథ్యం ఆయన నివాసం చుట్టూ పోలీసులు పహారా కాస్తున్నారు. కిర్లంపూడితో పాటు కొనసీమలోనూ భారీగా పోలీసులను మోహరించారు.

ముద్రగడతో పాటు మరికొందరు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, సాధనాల శ్రీనివాస్, ఈవై దాసు, నల్లా విష్ణు, కలవ కొలను తాతాజీ, పవన్ తదితరులను పోలీసులు రావులపాలెంలో అరెస్ట్ చేసి కాకినాడ 3వ టౌన్ పోలీసు స్టేషన్‌లో నిర్బంధించారు. దీంతో శాంతిపూర్వక వాతవారణానికి ప్రతీకగా వున్న ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పోలీసుల అరెస్టుల నేపథ్యంలో పరిస్థితి మొత్తం నివురుగప్పిన నిప్పులా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles