ఐడీ ఫ్రూఫ్ ఒరిజినల్ చాలూ.. జిరాక్స్ అక్కర్లేదు | Don't need ID copies to exchange old currency notes

Don t need id copies to exchange old currency notes

ID copies Xerox, Banks ID proof, Don't need ID copies, exchange old currency, old currency notes, queue at Banks, ID copies at bank

RBI in a statement says Don't need ID copies to exchange old currency notes.

జిరాక్స్ కాపీలు అవసరం లేదు

Posted: 11/16/2016 09:49 AM IST
Don t need id copies to exchange old currency notes

నోట్లను మార్చేందుకు, డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు బ్యాంకుల వద్ద క్యూ కడుతున్న జనాలకు మరో తలనొప్పి ఎదురవుతోంది. అదే ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీ సమర్పించటం. కేవలం ఐడీ మాత్రమే చూపితే చాలన్న ఉద్దేశ్యంతో చాలా మంది వెళ్తుంటే నకలు కాపీ తప్పనిసరి అంటూ సిబ్బంది మెలిక పడుతున్నారు.

అప్పటికప్పుడే బ్యాంకులు వాటిల్లోనే జిరాక్స్ మెషిన్ల సాయంతో కాపీలు అందిస్తున్నప్పటికీ, కొన్ని మాత్రం బయటకు వెళ్లి తెచ్చుకోవాల్సిందేనని తేల్చేస్తున్నాయి. దీంతో అప్పటి వరకు లైన్ లో నిలుచున్న వారు ఉస్సూరు మంటూ దాని జిరాక్స్ కోసం సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. అక్కడ రద్దీ, వాటి కోసం వెళ్లి వచ్చేలోగా లైన్ చాంతాడంత మారిపోవటంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

అయితే ఈ సమస్యకు చెక్ పెడుతూ ఆర్బీఐ ఓ ప్రకటన చేసింది. నోట్లు మార్చుకునేందుకు వెళ్లినవారు గుర్తింపు కోసం కేవలం ఐడీ కార్డులు చూపిస్తే సరిపోతుందని తెలిపింది. నగదు మార్పిడి దరఖాస్తులో పేర్కొన్న నంబర్లు సరైనవా, కాదా అని సరిచూసేందుకు మాత్రమే ఐడీ కార్డు చూపిస్తే సరిపోతుందని పేర్కొంది. ఈ విషయాన్ని ఎస్‌ బీఐ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు కూడా.

ఇంకుపడుద్ది...

పాత నోట్లు మార్చుకునేందుకు బ్యాంకు వెళ్లే వ్యక్తి కుడి చేతి చూపుడు వేలుకు సిరా మార్కు వేస్తారు. దీని వల్ల అదే వ్యక్తి వేరే బ్యాంకుల్లో మరిన్నిసార్లు నగదు మార్చుకునే వీలు ఉండదు. దీని వల్ల క్యూలైన్లు తగ్గడం, అక్రమపద్ధతుల్లో నగదు మార్పిడికి చెక్ పెట్టడంతోపాటు నగదు అందరికీ సులభంగా అందుతుందని కేంద్రం భావిస్తోంది.

పాత నోట్లను మార్చుకునే విషయంలో ఉన్న లొసుగులను ఆధారం చేసుకుని సాధారణ ప్రజలతోపాటు కొందరు అసాంఘిక శక్తులు సిండికేట్‌గా మారి.. జనాన్ని కిరాయికి పెట్టి మరీ నోట్లను మార్పిస్తున్నారన్న వార్తల నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bank  Currency Exchange  No ID proof Xerox  

Other Articles