6000 వేల కోట్లు అసుల స్వరూపం ఇదే! | Laljibhai Patel on 6000 crores surrender.

Surat businessman did not surrender rs 6000 cr

Laljibhai Patel, Narendra Modi, Laljibhai Patel Modi, 6000 Crores surrender, Surat Merchant Laljibhai Patel, Modi Suit Man, 6000 crores Gujarat Merchant, Surat Merchant 6000 crores, Laljibhai Patel denies rumours, Laljibhai Patel Interview

Gujarat diamond merchant Laljibhai Patel denies rumours of surrendering Rs 6000.

ITEMVIDEOS:ఆయన 6000 కోట్లు! హ. హ.. హ...

Posted: 11/16/2016 09:22 AM IST
Surat businessman did not surrender rs 6000 cr

నిజమో.. కాదో... నిర్ధారణ చేసుకోకుండా వార్తలు రాసేయటం, ఆపై నాలిక్కరుచుకోవటం మీడియాకు అలవాటైన పనే కదా!. దేశం మొత్తం తీవ్రంగా కుదిపేస్తున్న నోట్ల వ్యవహారంపై కూడా ఇలాంటే ఆత్రుతతేనే ప్రదర్శిస్తోంది. సోషల్ మీడియా పుణ్యమాని ఎక్కడో చోటు పుకార్లు లేవటం, ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ కావటం, వాటి ఆధారంగా కథనాలు రాసేసి చేతులు దులిపేసుకోవటం, ఆపై అంతా తూచ్ అంటూ ఇంకో వార్త రావటం, ఇదే జరుగుతోంది. అధికారులు వద్దని విజ్నప్తి చేస్తున్నా ఇదేతంతు...

అలాగే నిన్నంతా ఓ వార్త టాప్ స్టోరీలో నిలిచింది. సూరత్ కి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త మోదీ ప్రభుత్వానికి తన దగ్గరున్న ఆరు వేల కోట్లను ఇచ్చేశాడన్నది ఆ వార్త సారాంశం. అంతే దెబ్బకి ఆ నిర్ణయం తీసుకున్న వ్యాపారవేత్తను, అందుకు కారణమైన మోదీని అభినందిస్తూ కామెంట్లు పెట్టారు. ఒబామా పర్యటనలో వజ్రాల సూట్ ద్వారా లాల్జీ భాయ్ పటేల్ వార్తల్లో ప్రముఖంగా నిలిచిన విషయం తెలిసిందే. ఆయనే ఇప్పుడు 6000 వేల కోట్లు మోదీ ప్రభుత్వానికి ఇచ్చేశాడని కథనాలు వచ్చాయి. దీంతో లాల్జీ భాయ్ గ్రేట్ అంటూ అందులో పొగడ్తలు కురిపించారు. కానీ, అసలు ఆయన నోరు ఎక్కాడా మెదపలేదు.

అయితే స్థానిక మీడియాతో ఆయన స్పందించాడండోయ్. అసలు నేను ఎలాంటి డబ్బును నేను సరెండర్ చేయలేదు. నేనోక వజ్రాల వ్యాపారిని, ఎగుమతులు-దిగుమతులు చేసే వ్యక్తిని కాదు. నాకు అంత డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతోంది. దీంతో 6000 కోట్ల సరెండర్ కూడా గాలి వార్తే అయిపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Laljibhai Patel  rumours  6000 crores  PM Modi  

Other Articles