నాటి హాట్ నటి.. నేడు ప్రధానిపై ఘాటు వ్యాఖ్య.. people are suffering due to demonetisation says kushboo

Bjp should realise how people are suffering due to demonetisation khushbu

demonetisation, PM modi, Arun Jaitley, Kushubu sundar, kushboo, BJP, Congress, rbi rules, atm waiver, atm withdrawal, bridegroom, Bhajanpura ATM, marriage, Delhi, pm modi demonetisation, demonetisation rules, atm charges waiver, atm withdrawal, atm withdrawal charges, india news

National spokesperson for the Congress party, Khushbu Sundar, said, "Nobody is against the black money initiative. But, the prime minister's unplanned move has unfortunately been causing distress to several sections of the society".

నాటి హాట్ నటి.. నేడు ప్రధానిపై ఘాటు వ్యాఖ్య..

Posted: 11/15/2016 03:13 PM IST
Bjp should realise how people are suffering due to demonetisation khushbu

న‌ల్లధ‌నం, న‌కిలీ నోట్లను అరిక‌ట్టే నేపథ్యంలో పెద్దనోట్లను ర‌ద్దు చేస్తూ ప్రధాన‌మంత్రి న‌రేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నల్లకుబేరులపై ఎంతటి ప్రభావాన్ని చూపిందో తెలియదు కానీ, ప్రజలను మాత్రం నరకయాతన పెడుతుందని కాంగ్రెస్ నాయ‌కురాలు, నటి ఖుష్బూ అన్నారు. నోట్ల రద్దు విషయమై ఆలస్యంగా స్పందించిన అమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ మొసలి కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన జ‌నాలు ఆయనను నమ్ముతారా? అని ప్రశ్నించారు. తన నిర్ణయంపై దేశ ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆయన సానుభూతి పొందేక్రమాన్ని అశ్రయించారని దుయ్యబట్టారు.

మోదీ విధానాల‌తో దేశ‌ ప్రజలంతా ఎన్నో క‌ష్టాలు ఎదుర్కుంటున్నార‌ని, వారి ఇబ్బందుల‌ను ప్రధాని అర్థం చేసుకోవాలని ఖుష్బూ వ్యాఖ్యానించారు. ప్రజ‌ల క‌ష్టాల‌ను అర్థం చేసుకోవ‌డానికి ప్రధాని మోదీ ఏటీఎం సెంట‌ర్ల వ‌ద్దకు వెళ్లాల‌ని ఆమె సూచించారు. అవినీతిపై పోరు అంటూ ముందుచూపు లేకుండా ప్రధాని తీసుకున్న నిర్ణయం ప్రజలకు శాపంగా మారిందన్నారు. పెద్ద నోట్ల ర‌ద్దు చేసేముందు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవ‌డంతో మోదీపై ప్రజ‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నార‌ని ఆమె అన్నారు.

డబ్బులు అవసరమున్న ప్రతీ ఒక్కరు ఏటీఎంల కేంద్రాలకు చేరుకుని, తమ అవకాశం కోసం వేచిచూస్తున్న క్రమంలో అక్కడ తోపులాట, ఘర్షణలు కూడా జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. తాము కష్టపడి అర్జించిన సోమ్మపై ప్రభుత్వం అన్ని విధాలా పన్నులు కట్టించుకున్నాక.. కూడా తమ జేబుల్లోకి అవి వచ్చి చేరేందుకు మరోసారి ప్రయాసపడాల్సి వస్తుందని ప్రజలు అవస్థ పడుతున్నారని అన్నారు. ప్రజ‌లు ప‌డుతున్న క‌ష్టాల‌కు మోదీదే బాధ్యత అని వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : demonetisation  PM modi  Arun Jaitley  Kushubu sundar  kushboo  BJP  Congress  

Other Articles