వీడియో: హిజ్రాలను కూడా వదలకుండా కిరాతకంగా అత్యాచారాలు చేస్తున్నారు | No Safety for transgenders in Pakistan.

Video of transgender woman being whipped goes viral

Pak transgender attack, Pakistan transgender, transgender woman being whipped, transgender video attack, Pak Transgender Rape, Transgenders Rape, Transgender tortured, Transgenders in Pakistan, Pakistan Transgender attack Video

Pakistan transgender woman recall flogging incident. Raped, forced to drink urine.

ITEMVIDEOS:సంచలన వీడియో వెనుక భయానక వాస్తవాలు!

Posted: 11/15/2016 03:54 PM IST
Video of transgender woman being whipped goes viral

ప్రపంచదేశాల దృష్టిలో పరువు పోయే మరో వార్త ఇప్పుడు పాకిస్థాన్ కు కుదిపేస్తోంది. ప్రస్తుతం ఆడాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో... ఆ దేశంలో హిజ్రాలను కూడా వదలకుండా అఘాయిత్యాలకు పాల్పడటం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కొన్నాళ్ల క్రితం విడుదలైన ఓ వీడియోలో ఓ హిజ్రాను ఓ వ్యక్తి తోలు బెల్టుతో కసితీరా బాదటం, కట్టేసి కాలితో తంతూ చితకబాదటం, అడొచ్చిన తోటి హిజ్రాను నెట్టేయటం.. వెరసి ఆ వీడియో సంచలనం సృష్టించింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే పది మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కేసు విచారణలో ఉండగానే విస్తూ పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారంతా ఆ హిజ్రాలను అమ్మడానికి ప్రయత్నించటమేకాదు, ఏకంగా అత్యాచారాలు కూడా చేస్తున్నారంట.

ఆ దాడిని అతి దగ్గరగా చూసిన మరో హిజ్రా చెబుతున్న విషయాల ప్రకారం... ‘‘ఆ గ్యాంగ్ లీడర్ అయిన జజ్జా హిజ్రాను ముందుగా భాదితుడిని/రాలిని అందరి ముందు కట్టేసి కొట్టడం ప్రారంభించాడంట. ఆపై మరో హిజ్రా ఓ ఇంట్లోకి తీసుకెళ్లి ఇలా తన్నటం మొదలుపెట్టాడు. అక్కడ చాలా మంది హిజ్రాలు కూడా ఉన్నారంట. ఈ విషయాలను ఘటనా స్థలంలోనే ఉన్న జోలి అనే హిజ్రా ఓ ఇంటర్వ్యూలో చెప్పకొచ్చింది/చ్చాడు. అక్కడ హిజ్రాలను విపరీతంగా కొట్టడం, గుండ్లు గీయటం, అత్యాచారాలు చేయటం లాంటి వాటితో ఆ ప్రాంతమంతా నరకప్రాయంగా ఉందని తెలిపింది. అంతేకాదు చివరికి వారి మూత్రం తాగమంటూ వేధించారంట కూడా.

 

పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు సియాల్ కోట్ ప్రాంతంలో ప్రధాన నిందితుడు జజ్జాతోపాటు మరో పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దీనిపై జజ్జా ఏం చెబుతున్నాడంటే.. చెడు అలవాట్లు మానుకోలేకపోతున్నాడనే ఆ హిజ్రాను అలా కొట్టానని పోలీస్ విచారణలో తెలిపాడు.

కాగా, పాకిస్థాన్ లో హిజ్రాలకు అస్సలు భద్రత లేదని పలు స్వచ్ఛంధ సంస్థలు చెబుతున్నాయి. అడ్డుకోవటం, డాన్సులు చేయటం, వ్యభిచారం చేయాలంటూ హిజ్రాలపై అక్కడ అడపా దడపా దాడులు జరుగుతూనే ఉంటాయని వారంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  transgender attack  whipped video  Gang arrested  

Other Articles