నాపై కుట్రపూరితంగా చర్యలు.. కంటతడి పెట్టిన ఎంపీ Graft charges against me painful, says Ram Gopal Yadav

Emotional ramgopal yadav cries foul over ouster from samajwadi party

Ramgopal Yadav, Member of Parliament, breaks down, Itawa, samajwadi party, akilesh yadav, mulayam singh, shivpal yadav, amar singh, suspension

Ousted Samajwadi Party general secretary Ramgopal Yadav broke down while defending the corruption charges levelled against him and said that injustice has been meted out to him.

నాపై కుట్రపూరితంగా చర్యలు.. కంటతడి పెట్టిన ఎంపీ

Posted: 11/14/2016 07:33 PM IST
Emotional ramgopal yadav cries foul over ouster from samajwadi party

సమాజ్ వాదీ పార్టీలో రేగిన అంతర్గత చిచ్చు ఇప్పడప్పుడే చల్లారేలా లేదు. ఇప్పటికే బాబాయ్ అబ్బాయ్ లు పార్టీ సభలు, సమావేశాల్లో కార్యకర్తలు తొడగొట్టి సవాళ్లు, ప్రతిసవాళ్లు, దాడులకు దిగుతుండగా, అటు అఖిలేఖ్-శివపాల్ యాదవ్ లు కూడా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఈ తరుణంలో తాను సమాజ్‌ వాదీ పార్టీలోనే ఉన్నానని ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ములాయం సోదరుడు, రాజ్యసభ సభ్యుడు రాంగోపాల్‌ యాదవ్‌ తెలిపారు. అధికారికంగా పనిచేయనప్పటికీ పార్టీలోనే కొనసాగుతున్నట్టుగా భావిస్తున్నానని చెప్పారు.

బీజేపీతో చేతులు కలిపి సమాజ్‌ వాదీ పార్టీని బలహీనం చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో రాంగోపాల్‌ యాదవ్‌ ను బహిష్కరించారు. అఖిలేశ్ యాదవ్‌ సర్కారు ఇమేజ్‌ ను దెబ్బీయడానికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. ములాయం కుటుంబ వివాదంలో అఖిలేశ్ కు మద్దతుగా ఆయన నిలబడ్డారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని అన్నారు. స్వప్రయోజనాల కోసం పాకులాడలేదని పేర్కొన్నారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని ప్రజలు అనుకుంటే, తనకు న్యాయం చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramgopal Yadav  breaks down  Itawa  samajwadi party  akilesh yadav  mulayam singh  shivpal yadav  

Other Articles