ప్రజల ఇబ్బందులకు తలొగ్గి దిగొచ్చిన కేంద్రం Government tries to smooth cash flow

Bank correspondents limit raised to rs 50k

banks, bank managment, Arun jaitley, cm kcr, DEA, Secretary Shaktikanta Das, RBI, new Rs 500 notes, Nashik press, Currency Ban, notes ban, Rs 2,000 note, PM Modi, Narendra Modi, Prime Minister, Facebook, Twitter, War on Black Money, BJP, ATM queues, Bank queue, New Currency Notes, Exchange Old Currency Notes

The government announced a series of steps to increase supply of cash in the economy and said there was no need for panic among public as adequate cash was being made available.

ప్రజల ఇబ్బందులకు తలొగ్గి దిగొచ్చిన కేంద్రం

Posted: 11/14/2016 06:51 PM IST
Bank correspondents limit raised to rs 50k

అవినీతి, నకిలీ నోట్లపై యుద్దం ప్రకటించిన కేంద్ర నిర్ణయంతో గత వారం రోజులగా ప్రజలు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఎట్టకేలకు కేంద్రం దిగివచ్చింది. కొత్త నోట్ల విషయంలో కొంత ఉపశమనం కల్పించాలని భావించిన కేంద్రం అమేరకు నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ దగ్గర తగినంత నగదు అందుబాటులో ఉందని భరోసా ఇచ్చిన రాబోయే రోజుల్లో పరిస్థితి  చక్కబడుతుందని హామీ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పరిస్థితిని అంచనా వేస్తున్నారని, పెద్ద నోట్ల రద్దు వల్ల తలెత్తిన పరిస్థితిని తాము సమీక్షిస్తున్నామని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ తెలిపారు.

దేశ ప్రజలకు నగదును నేరుగా  అందించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశామని, నగదును వేగంగా ఆందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏటీఎంల వ‌ద్ద భ‌ద్ర‌త పెంచేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 1.3లక్షల పోస్టాఫీసులను సిద్ధంగా ఉంచనున్నట్టు  ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని త‌పాల కార్యాల‌యాల్లోనూ న‌గ‌దు డిపాజిట్ కు ఇబ్బందులు ఉండ‌బోవ‌ని తెలిపారు. ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందుల దృష్ట్యా నోట్ల మార్పిడి, విత్ డ్రా ప‌రిమితిని పెంచామ‌న్నారు. బ్యాంకుల్లో వారానికి న‌గ‌దు విత్ డ్రా ప‌రిమితిని రూ.24 వేల‌కు పెంచామని, ఈ న‌గ‌దును ఖాతాదారుడు ఒకేరోజైనా లేదా వారంలో ఎప్పుడైనా స‌రే తీసుకోవ‌చ్చ‌ని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs 500. Rs 1000  Rs 2000 new note  Rs 2000 new note  banks  pm modi  Reserve bank of India  

Other Articles