అది పూర్తిగా దిక్కుమాలిన చర్యట.. telangana cm kcr slams central government on scraping of currency notes

Telangana cm kcr slams central government on scraping of currency notes

cm kcr, telangana cm kcr, kcr slams central covernment, RBI, new Rs 500 notes, Nashik press, Currency Ban, notes ban, Rs 2,000 note, PM Modi, Narendra Modi, Prime Minister, Facebook, Twitter, War on Black Money, BJP, ATM queues, Bank queue, New Currency Notes, Exchange Old Currency Notes

telangana cm k.chandrshekar rao slams union government on scraping of Rs 500, Rs 1000 currency notes, questions centre why they didnt discuss with states

మోదీ ప్రభుత్వానిది పూర్తిగా దిక్కుమాలిన చర్య..

Posted: 11/14/2016 10:20 AM IST
Telangana cm kcr slams central government on scraping of currency notes

అవినీతి, నకిలీ నోట్లను ఒక్క పెట్టున తొలగిస్తామని సంచలనాత్మక నిర్ణయం తీసుకుని పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్రంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు తనదైన స్టైల్లో స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత.. కాస్తా అలోచించి.. మంచి, చెడులను గత వారం రోజులుగా అధ్యయనం చేసిన కేసీఆర్.. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం దిక్కుమాలినదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కేంద్రం పురోగాభివృద్ది అలోచిస్తున్న సమయంలో గత వారం రోజులుగా దేశాభివృద్ది ఎంతలా తిరోగమనం వైపు సాగుతుందో కూడా పరిశీలించాలని ఆయన సూచించారు. కేంద్రం దిక్కుమాలిన నిర్ణయంతో దేశం ముఫై ఏళ్లు వెనక్కి పోయే ప్రమాదముందని అయన అందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానిది ఏకపక్ష నిర్ణయమని, ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి ఉండాల్సిందని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. నోట్ల మార్పిడితో ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని... దీనిపై ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని వ్యాఖ్యానించినట్లు సమాచారం.

సామాన్య ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని, ప్రతి కుటుంబం బ్యాంకులు, ఏటీఎంల దగ్గర రేయింబవళ్లు క్యూ కట్టే దుస్థితి వచ్చిందన్నారు. కేవలం రూ.4 వేలు మాత్రమే మార్పిడి చేసే నిబంధన, రూ.2.5 లక్షల పరిమితి దాటితే ఆదాయపు పన్ను పడుతుందని భయపెట్టడం సరికాదని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మేకలు, గొర్రలు పెంచే రైతులు సైతం లక్షల్లో నగదు లావాదేవీలు చేస్తారని. అంతమాత్రాన వాళ్లు నల్లధనం దాచుకున్న సంపన్నులు కారు. ఇవన్నీ కేంద్రం పట్టించుకోకుండానే.. తన నిర్ణయాన్ని ప్రజలపై రుద్దిందన కేసీఆర్ మండిపడినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles