మధుయాష్కీ టీఆర్ఎస్ లోకి వెళ్తారా? వెళ్లరా? | Ex MP Madhu Yashki Goud on TRS Joining.

Ex mp madhu yashki goud not interested trs

Congress Senior Leader, EX MP Madhu Yashki Goud, Madhu Yashki Goud, Madhu Yashki Goud TRS, Congress TRS, Congress leader no for TRS, Madhu Yashki Goud TRS, Madhu Yashki Goud KCR, Madhu Yashki Goud News

Congress Senior Leader, EX MP Madhu Yashki Goud denies rumour on joing TRS Party.

టీఆర్ఎస్ అంటే ఆయనకు మరీ అంత ‘ఛీ’పా?

Posted: 11/14/2016 10:24 AM IST
Ex mp madhu yashki goud not interested trs

తెలంగాణ అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిలోకి సందు దొరికితే చాలూ దూరేద్దామని చాలా పెద్ద తలకాయలే కాచుకుని కూర్చున్నాయి. ఓవైపు ఇప్పటికే ఓ పార్టీని ఖాళీ చేసేయగా, ప్రస్తుతం ప్రతిపక్ష కాంగ్రెస్ ను టార్గెట్ చేసి ఆకర్ష్ ప్రారంభించాడు గులాబీ బాస్. టాప్ లీడర్లంతా ఒక్కోక్కరుగా పార్టీని వీడుతూ కారు ఎక్కేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

ఆ మధ్య కొందరు ఏకంగా హరీష్ రావు, కేటీఆర్ లాంటి కీలక నేతలను కలిసి వారిద్వారా సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు వచ్చాయి. వచ్చిన కొద్దిరోజులకే వివేక్ లాంటి కీలక నేత టీఆర్ఎస్ లోకి జంప్ అయిపోయాడు. ఇంకొందరు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారని వినికిడి. అందులో నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పేరు కూడా ఉంది. సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత కనుమరుగైన ముఖ్య నేతల్లో ఆయనకూడా ఉన్నారు. మరి చేరికపై ఏమంటున్నారు?

‘‘టీఆర్ఎస్ లోకా? ఛీ ఛీ ఛీ ఛీ ఛీ... చాన్సే లేదు. రాజకీయం నా జీవితం కాదు. తెలంగాణ పౌరుల భవిష్యత్తు బాగుండాలన్నదే నా అభిమతం. తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టి కాంగ్రెస్ తో పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని తెప్పించడంలో నా వంతు పాత్ర పోషించాను. ఇక ఉద్యమ పార్టీగా చెప్పుకుని, ప్రజలను మభ్యపెట్టి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీలో చేరేందుకు నాకేమీ వ్యాపారాలు లేవు. డబ్బు సంపాదించాలన్న ఆశ లేదు" అంటూ తెలిపాడు.

తెలంగాణ ప్రజలను తీవ్రంగా వంచిస్తున్న అధికార పార్టీలో తాను చేరే ప్రసక్తే లేదని ఓ టీవీ చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో తెలిపాడు. భవిష్యత్తులో మీరు టీఆర్ఎస్ పార్టీ పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉందా? మీ పేరు వినిపిస్తుంది కాదా? అని యాంకర్ అడిగిన మధుయాష్కి ఈ రేంజ్ లో రియాక్ట్ అయ్యాడన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhu Yashki Goud  TRS  Congress  

Other Articles