ఏటీఎం, బ్యాంకుల్లో డబ్బు డ్రా పరిమితిని పెంచేశారోచ్...కానీ, | India raises cap on bank cash withdrawal to ease public anger

Atm withdrawal limit increased

cash withdrawal, cash withdrawal limit, India raises cap on bank cash withdrawal, New 500 Rupees Note, India New Currency, Withdrawal Limit, Withdrawal Limit ATM, Withdrawal Limit exceed, RBI Cash Withdrawal, Old notes exchange date, Old notes exchange date exceed

After Rs 500 Note Launch, Withdrawal Limits At ATMs, Banks Raised.

డబ్బు డ్రా పరిమితిని పెంచేశారోచ్... పాత నోట్లకు గడుపు కూడా!

Posted: 11/14/2016 08:34 AM IST
Atm withdrawal limit increased

పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం నిర్ణ‌యం నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటం, ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందంటూ విమర్శలు రావటం తెలిసిందే. మరోవైపు గత నాలుగు రోజులుగా ప్రజలు నోట్ల మార్పిడి, చిల్లర, చేతిలో సరిపడా కరెన్సీ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఊరట కలిగిస్తూ మరో నిర్ణయం తీసుకున్నారు.

ఆర్బీఐ తో సంప్రదించి మనీ విత్ డ్రా పరిమితుల్లో మార్పులు చేసింది. పాత నోట్ల మార్పిడి పరిమితిని రూ.4 వేల నుంచి రూ.4500 కు పెంచింది. ఇక రోజుకు రూ.10 వేలు మాత్రమే విత్ డ్రా నిబంధనను ఉపసంహరించుకుంది. వారానికి విత్ డ్రా పరిమితిని రూ.20 వేల నుంచి రూ.24 వేలకు పెంచింది. ఏటీఎంలో విత్ డ్రా పరిమితిని రూ.500 పెంచడంతో రోజుకు రూ.2500 విత్ డ్రా చేసుకోవచ్చు. మరోవైపు ప్రదాన పట్టణాలలో 500 రూపాయల నోట్లు ఇప్పటికే విడుదల కాగా, రేపటి నుంచి దాదాపు దేశం మొత్తం అందుబాటులోకి రావచ్చొనే సంకేతాలు అందుతున్నాయి.

మరోవైపు సరైన కారణం చూపించి రూ.50వేల వరకూ నగదును విత్ డ్రా చేసుకునేలా కేంద్రం నిర్ణయం తీసుకుందదని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ కాసేపటి క్రితం మీడియా సమావేశంలో వెల్లడించారు. అంతేకాదు.. బ్యాంకులో రోజుకు ఎన్నిసార్లు అయినా నగదు జమ చేసుకోవచ్చని.. దీనికి ఎలాంటి పరిమితి లేదన్న ఆయన.. రూ.2.5లక్షలు దాటితే మాత్రం ఆధారాలు చూపించాలని స్పష్టం చేశారు.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్య ప్రజలకు కాస్త ఊరట కలిగించినట్లయ్యింది. అయితే సవరించబడిన కొత్త నిబంధనలు సాఫ్ట్వేర్ అప్డేట్ అయిన ఏటీఎంలకు మాత్రమే వర్తిస్తుందని చెప్పటం, సోమవారం బ్యాంకులకు హాలీడే కావటంతో మరో రెండు రోజులు పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉంది.

పాత నోట్లకు గడుపు పెంపు...

మరోవైపు పాత రూ.500, వెయ్యి రూపాయల నోట్ల వినియోగాన్ని 10 రోజుల పాటు కేంద్రం పొడిగించింది. ముందుగా 14వ తేదీ వరకే వాటి వాలిడిటీ ఉంటుందని చెప్పినప్పటికీ, ప్రజల నుంచి వస్తున్న విజ్నప్తుల నేపథ్యంలో అవి చెల్లుబాటు అయ్యేలా ఈ నెల 24 వరకు తేదీని మార్చింది.

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోలు బంకులు, ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వే, బస్సు టికెట్లు, ఎయిుర్ పోర్టుల్లోని కౌంటర్లలో విమాన టికెట్లు, ప్రభుత్వ, ప్రైవేటు ఫార్మసీల్లో మందుల కొనుగోలు, ఎల్పీజీ సిలిండర్లు, రైల్వే కేటరింగ్‌, టోల్ గేట్లు నవంబర్‌ 24 అర్ధరాత్రి వరకు పాత నోట్లు చెల్లుబాటవుతాయి.

అంతేకాదు మున్సిపాలిటీ, స్థానిక సంస్థల పన్నులు చెల్లించవచ్చు. కొత్త కరెన్సీ ప్రజలందరికీ అందుబాటులోకి రావటానికి ఈ సమయం సరిపోతుందని కేంద్రం భావిస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cash withdrawal  Exceed  India  New Currency  RBI  

Other Articles