ఆ మనిషి ఎందుకలా పడిపోయాడు?.. వైరల్ అవుతున్న వీడియో | Man Dies Of Heart Attack While Talking to His Family

Man dies of heart attack while talking to his family

Man Dies Of Heart Attack While Talking to His Family Members In Ahmedabad.

Man Dies Of Heart Attack While Talking to His Family Members In Ahmedabad

ITEMVIDEOS:మాట్లాడుతుండగానే ఆ గుండె కుప్పకూలిపోయింది

Posted: 11/14/2016 09:57 AM IST
Man dies of heart attack while talking to his family

దయచేసి గుండె జబ్బులు ఉన్న వారు, సున్నిత మనస్కులు ఈ వీడియో చూడకండి.

‘‘ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ ... విధివిధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరూ’’ అని ఓ మహకవి పాట రూపంలో తెలిపాడు. అది అక్షరాల సత్యం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఇప్పుడు ఎవరూ చెప్పలేకపోతున్నారు. అప్పటిదాకా నవ్వుతూ మాట్లాడుతున్న ఓ వ్యక్తి కళ్ల ముందే కుప్పకూలితే ఎలా ఉంటుంది?

సరిగ్గా అహ్మదాబాద్ లో ఇలాంటి ఘటనే జరగ్గా.. అందుకు సంబంధించిన వీడియో నెట్ లో వైరల్ గా మారిపోయింది. ఓ వ్యక్తి మాట్లాడుతూనే మరణించిన ఘటన వీడియో ప్రస్తుతం నెట్ లో వైరల్ గా మారింది. ఓ వ్యక్తి తన ఇంటి ముందు నిలుచుని భార్య, అతని అమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడుతూనే హఠాత్తుగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే కంగారు పడిన ఆ ఇల్లాలు చుట్టుపక్కలవారిని పిలవటం, వారు అంతా గుమిగూడి అతడు చనిపోయాడని నిర్ధారించుకోవటం అంతా ఆ వీడియోలో ఉంది.

 

ఆ ఇంటికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో ఆ వీడియో మొత్తం నమోదైంది. సెప్టెంబర్ 16వ తేదీన అప్ లోడ్ చేసిన ఈ వీడియో, ఇప్పుడు అన్ని మీడియా ఛానెళ్లలో ప్రముఖంగా మారిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles