ట్రంప్ క్యాబినెట్ లో భారత సంతతి వ్యక్తికి మంత్రి పగ్గాలు..? Bobby Jindal among probables in Donald Trump's Cabinet

Bobby jindal among probables in donald trump s cabinet

US presidential elections, trump cabinet, indo-american bobby jindal, health secretary. hillary clinton, FBI, FBI director James Comey, e-mail probe, donald trump, emocratic party, republican party, hillaru clinton emails probe, hillary confident

If appointed, 45-year-old Jindal will be the first ever Indian-American to be included in the president's cabinet and second ever to be elected to the US Congress.

ట్రంప్ క్యాబినెట్ లో భారత సంతతి వ్యక్తికి మంత్రి పగ్గాలు..?

Posted: 11/13/2016 09:24 PM IST
Bobby jindal among probables in donald trump s cabinet

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలో నిలిచి యావత్ ప్రపంచం విస్మయంలో ముంచి గెలుపోందిన డోనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన తరువాత భారతీయులకు ఓ చక్కని బహుమానం అందించనున్నారు. ఏంటా గిప్ట్ అంటున్నారా..? మరేంలేదని.. ట్రంప్ కు పోటీగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన బాబీ జిందాల్ కు ట్రంప్ క్యాబినెట్ లో స్థానం కల్పించనున్నారు. ఈ మేరకు అమెరీకన్ మీడియాలో కథనాలు ప్రచురితం అయ్యాయి.

లూసియానా నుంచి రెండు సార్లు గవర్నర్ గా బాబీ ఎన్నికయ్యారు. ఓ అమెరికా రాష్ట్రానికి గవర్నర్ గా ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తి బాబి జిందాల్. మీడియా రిపోర్టుల ప్రకారం ట్రంప్ కేబినేట్ లో బాబీ స్ధానం పొందితే ఆ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ అమెరికన్ గా ఆయన రికార్డులకెక్కుతారు. అంతేకాకుండా యూఎస్ కాంగ్రెస్ కు ఎన్నికైన రెండో భారతీయ అమెరికన్ గా కూడా నిలుస్తారు. బాబీ, బెన్ కార్సన్ లను ఆరోగ్య శాఖ కార్యదర్శులుగా నియమించే అవకాశం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో పేర్కొంది.

కార్సన్, బాబీలు ఇద్దరూ రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవి అభ్యర్ధిగా నామినేట్ అయ్యేందుకు పోటీ పడ్డారు. ఆ తర్వాత ఇద్దరూ పోటీ నుంచి తప్పుకున్నారు. అధ్యక్ష పదవి అభ్యర్ధిగా టెడ్ క్రూజ్ ను బలపరుస్తూ బాబీ ప్రచారం చేయగా.. కార్సన్ ట్రంప్ తరఫును ప్రచారం చేశారు. కేబినేట్ లో స్ధానంపై బాబీ జిందాల్ ను ప్రశ్నించగా ఆయన స్పందించలేదు. అయితే, ట్రంప్ కు మద్దుతు పలికిన కార్సన్ కు కేబినేట్ లో స్ధానం ఖాయంగానే కనిపిస్తోంది. ఆరోగ్య శాఖ సెక్రటరీగా కార్సనే తన మొదటి చాయిస్ అని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles