సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజాకు చుక్కెదురు ysrcp mla roja queue up for exchange of currency

Ysrcp mla roja queue up for exchange of currency

mla roja, ysrcp mla roja, chitoor, nagari, RBI, new Rs 500 notes, Nashik press, Currency Ban, notes ban, Rs 2,000 note, PM Modi, Narendra Modi, Prime Minister, Facebook, Twitter, War on Black Money, BJP, ATM queues, Bank queue, New Currency Notes, Exchange Old Currency Notes

Ysrcp mla Roja questions bank officials on new currency stock, after standing in queue for a short time in her nagari assembly constituency

ITEMVIDEOS: సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజాకు చుక్కెదురు

Posted: 11/13/2016 08:49 PM IST
Ysrcp mla roja queue up for exchange of currency

ఎమ్మెల్యే రోజాకు సొంత నియోజకవర్గంలో చుక్కెదురైంది. అదేంటి ఇప్పుడు ఏ ఎన్నికలు కూడా లేవు.. కానీ రోజాకు చుక్కెదురైందని అంటున్నారు అని కంగారుపడకండి. తొలిసారిగా శాసనసభకు ఎన్నికైన అమె ప్రశ్నల ధాటికి అధికారపక్షం ఉక్కిరిబిక్కిరై అమెను శాసనసభలోకి అడుగుపెట్టనీయకుండా ఏడాది పాటు వేటు వేసిందని వైఎస్సార్ సిపీ పార్టీ వర్గాలు చెబుతున్న సమయంలో.. చట్టసభకు ఎన్నికై కూడా తమ ఉచ్చులో బిగుసుకుపోయేలా చర్యలు తీసుకున్నామని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఆ విషయం డీటైల్స్ లోకి వెళ్లకుండా మ్యాటర్ లోకి వెళ్తే.. తాజాగా అమెకు ఇవాళ తన సొంత నియోజకవర్గంలోనూ చుక్కెదురైంది.  

అవినీతి, నకిలీ నోట్లను ఒక్క పెట్టున తొలగిస్తామని సంచలనాత్మక నిర్ణయం తీసుకుని పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్రం.. ఇప్పటికీ ప్రజలకు అవసరమైన మేరకు డబ్బులను అందుబాటులోకి తీసుకురాలేకపోయింది. తన వద్దనున్న పెద్దనోట్లను మార్చుకునేందుకు చిత్తూరు జిల్లా నగరిలో అదివారం ఎస్ బి ఐ బ్రాంచీ బ్యాంకుకు వెళ్లారు. అప్పటికే నోట్ల మార్పిడి, విత్ డ్రా, డిపాజిట్ల కోసం వందల మంది క్యూలో నిల్చోగా.. రోజా కూడా వారితో  పాటు కలిసే క్యూ లైన్లో నిల్చున్నారు.

అలా నిలబడిన కొద్ది సేపటికి బ్యాంకులో క్యాష్ అయిపోయిందని, బ్యాంకు అధికారులు క్యూలో నిల్చున్న కస్టమర్లందర్నీ తిప్పిపంపించారు. దీంతో గత నాలుగైదు గంటలుగా క్యూలైన్నో నిలబడిన తరువాత అటు ఇంటి పనులు చేసుకునే వీలు లేకుండా, మరో బ్యాంకులకు వెళ్లి బ్యాంకు లావాదేవీలు జరుపుకునే అవకాశాలు లేకుండా అంతా ముగిసి బ్యాంకు సమయం ముగుస్తున్న తరుణంలో ఇలా ప్రకటించడంపై మండిపడ్డారు. బ్యాంకులోనికి వెళ్లి అధికారులను ప్రశించారు. వారు ఏవో కారణాలు చెప్పినా సంతృప్తి చెందని రోజా.. వెనుదిరిగారు. దీంతో సోంత నియోజకవర్డంలో అమెకు చుక్కెదైందని కొందరు గుసగుసలాడుకుంటుటన్నారు.

 అ తరువాత మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల విషయం ఏంటని ప్రశ్నించారు. ముందస్తు అవగాహన కల్పించకుండా ఉన్నఫళంగా పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల సామాన్యుడికి కష్టాలు వచ్చాయని అన్నారు. కొత్త నోట్ల పంఫిణీ, పాత నోట్ల రద్దుపై ముందస్తు ప్రణాళికలు లేకుండా కేంద్రం చేసిన చర్యలకు దేశవ్యాప్తంగా ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు. నల్లధనం దాచుకున్న కుబేరులకు లీక్‌ ఇవ్వడంతో వారు సంతోషంగా ఉన్నారని సామాన్యులే కష్టాలు పడుతున్నారని విమర్శించారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు, పేషంట్లు పనులన్నింటినీ మానుకుని గంటల కొద్దీ క్యూలో ఉన్నా డబ్బులు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles