పబ్లిక్ గా వాట్సాప్ లోని నీలి చిత్రాలు దొరికేసిన మంత్రి | Karnataka Minister caught watching porn during Tipu Jayanti

Karnataka minister caught watching porn during tipu jayanti

Karnataka education minister, Tanveer Sait, Tanveer Sait whats app, Minister Whats app porn, Karnataka minister, Minister caught porn, MLA watch porn, Indian leader caught porn, Leader whats app porn, Tippu jayanti celebrations 2016

Karnataka education minister Tanveer Sait caught watching porn during Tipu Jayanti.

ఆ మంత్రి వాట్సాప్ నిండా బూతు బొమ్మలే!

Posted: 11/11/2016 10:53 AM IST
Karnataka minister caught watching porn during tipu jayanti

పబ్లిక్ ప్లేసులో పోర్న్ వీడియోల వేషాలు మన నాయకులకు కొత్తేం కాదు. సాక్షాత్తూ చట్టసభల సాక్షిగానే మంత్రులు వెకిలి చేష్టలు గతంలో చాలానే బయటపడ్డాయి. ఇక ఇప్పుడు కర్ణాటక మంత్రి తన్వీర్ సేఠ్ వంతు వచ్చింది. ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయన వ్యవహారంతో పార్టీకి తలవంపులు తీసుకొచ్చారు.

టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా రాయచూర్ లో నిర్వహించిన కార్యక్రమంలో, తన మొబైల్ ఫోన్ లో వాట్సాప్ కి వచ్చిన నీలి చిత్రాలు చూస్తూ మీడియాకు ఆయన అడ్డంగా బుక్కయ్యారు. సాక్షాత్తూ పక్కన వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణా బైరే సమక్షంలోనే ఈ తతంగం జరగటం విశేషం. ఈ వార్త అన్ని చానళ్లలో రావడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. అయితే తాను చేసిన ఘనకార్యాన్ని తన్వీర్ నిస్సిగ్గుగా సమర్థించుకున్నారు.

"తాను ఇల్లు విడిచి మూడు నెలలు అయింది" అంటూ నీతిబాహ్యమైన సమాధానం ఇచ్చారు. అంతేకాదు తానసలు ఆ వీడియోలు చూడలేదని, కేవలం టిప్పుకు సంబంధించిన కొన్ని వీడియోలు చూశానంటూ బుకాయించాడు కూడా. దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రి పరమేశ్వర్ లు మీడియాతో మాట్లాడుతూ పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోపక్క ఈ ఘటనపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ నివేదిక కోరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతిపక్షాలు ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తున్నాయి.,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Porn Videos  Tanveer Sait  Whats app  

Other Articles

 • Free beer and doughnuts to promote vaccines for youth in united states

  కరోనా టీకా వేయించుకున్న యువతకు ఉచితంగా బీరు.!

  May 07 | కరోనా వైరస్ ఓ వైపు విజృంభిస్తున్నా.. యువత మాత్రం వ్యాక్సిన్ వేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో యువతను వాక్సీన్ వేయించుకునేలా ప్రేరేపించే చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని భావించింది. అయితే టీకా తీసుకోవాలంటూ... Read more

 • Natco rolls out baricitinib ahead of approval for patent waiver

  కరోనా రోగులకు ఊరట కల్పించనున్న నాట్కో ఫార్మా

  May 07 | దేశంలో కరోనా వైరస్ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మానవత్వంతో ముందుకువచ్చిన ఫార్మ సంస్థతో బాధితులకు ఊరట కలగించే వార్తను అందించింది. కరోనా మహమ్మారి బారినపడి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రుల్లో చేరే రోగుల్లో కనిపించే... Read more

 • Cm kcr clarifies on lockdown shows impact on economy and people in telangana

  తెలంగాణలో లాక్ డౌన్ విధింపుపై సీఎం కేసీఆర్ క్లారిటీ

  May 07 | రాష్ట్రంలో లాక్ డౌన్‌ విధించే విషయంలో ఇప్పటికే పలు రకాల ఊహాగానాలు వినబడుతున్న నేపథ్యంలో వాటన్నింటినీ తోసిరాజుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టమైన ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో లాక్ డౌన్‌ విధించబోమని ఆయన... Read more

 • Eatala rajender says telangana movement done was not for family rule

  కుటుంబ పాలన కోసం తెలంగాణ ఉద్యమం సాగలేదు: ఈటెల

  May 04 | ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సాధించుకున్న తెలంగాణలో తాను సాగిస్తున్నది మాత్రం ముమ్మాటికీ ఆత్మ‌గౌర‌వ ఉద్యమమ‌ని మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ చెప్పారు. ఎన్నారైల‌తో ఆయ‌న తాజాగా వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.... Read more

 • Mexico city rail overpass collapses killing 15 and injuring 70

  ITEMVIDEOS: వంతెనను చీల్చుకుని రోడ్డుపై పడిన మెట్రో రైలు.. 20 మంది మృతి

  May 04 | ఉత్తర అమెరికాలోని మెక్సికోలో ఘోరప్రమాదం జరిగింది. రాజధాని మెక్సికో సిటీలో వంతెనపై ప్రయాణిస్తున్న మెట్రో రైలు తన పాస్ ఓవర్ ను చీల్చుకుని కిందననున్న రోడ్డుపైకి పడింది. ఇక రెండు మెట్రో బోగీలు మాత్రం... Read more

Today on Telugu Wishesh