వైఎస్, చంద్రబాబు తర్వాత పవన్ ? | Pawan Kalyan ready to Padayatra.

Pawan kalyan on reservations and new currency

Gutti Engineering college, Pawan kalyan, Pawan Kalyan with Engineering Students, pawan kalyan black money, pawan Kalyan Reservations, Pawan Kalyan Gutti Speech, janasena Gutti, Pawan kalyan comments Balayya

Pawan kalyan on reservations and new currency at Gutti Engineering college interaction.

రిజర్వేషన్లు, నోట్ల రద్దుపై పవన్ ఒపీనియన్

Posted: 11/11/2016 11:37 AM IST
Pawan kalyan on reservations and new currency

అన్ని కులాలు స‌మాన‌మ‌నే తాను న‌మ్ముతాన‌ని సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ కల్యాణ్ అంటున్నాడు. అనంపురం జిల్లా గుత్తిలో నిర్వహించిన విద్యార్థుల‌తో ఇష్టాగోష్ఠిలో ఆయన ఓ విద్యార్థిని అడిగిన రిజ‌ర్వేష‌న్ల అంశంపై స‌మాధానం చెబుతూ... రిజ‌ర్వేష‌న్ అనేది చాలా సున్నిత‌మైన స‌మ‌స్య అని వివరించాడు. ‘నేను ఏదైనా మాట్లాడితే అది అపార్థం చేసుకునే ప్ర‌మాదం ఉంది. రిజ‌ర్వేష‌న్లు పొంద‌లేని వారి ఆవేద‌న, బాధను అర్థం చేసుకోగ‌ల‌ను. రిజ‌ర్వేష‌న్లతో నైపుణ్యం ఉన్న విద్యార్థులు దూరం అవుతున్నార‌ని అంటున్నారు. అది నిజ‌మే. రిజ‌ర్వేష‌న్ లేని కులాలవారు బాధ‌ప‌డుతున్నారు. అసెంబ్లీలో మీ ప్ర‌శ్న‌ను వినిపిస్తాను. పార్ల‌మెంటులో కూడా వినిపిస్తాను. కులాన్ని గౌర‌విస్తాను త‌ప్ప నెత్తికెత్తుకోను’ అని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. ప్రస్తుతం కులాలను బేస్ చేసుకునే ఎంతో మంది రాజకీయాలు చేస్తున్నారని, తాను అలాంటి వాటికి వ్యతిరేకం అని చెప్పుకొచ్చాడు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ తీసుకున్న‌ పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం మంచిదేన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. దేశంలో కూరుకుపోయిన అవినీతి, న‌ల్ల‌ధ‌నం, న‌కిలీ నోట్ల నిరోధానికి ఇటువంటి నిర్ణ‌యాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని చెప్పారు. క‌ట్టిన ప‌న్నులతో ప్ర‌భుత్వ ఆదాయం పెరిగి మ‌ళ్లీ అది జ‌నాల‌కే అందితే ఎంతో సంతోష‌మ‌ని చెప్పారు. బ్లాక్ మ‌నీ ప్ర‌క్షాళ‌న రాజ‌కీయ నాయ‌కుల నుంచే జ‌రిగితే బాగుంటుంద‌ని అన్నారు. మ‌నిషి ఆదాయానికి మించిన ఖర్చు కూడా చేయకూడదని సూచించారు.

అనంతపురం కోసం మీరు ఏం చేయగలరు అని ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు... త‌న‌కు పాదయాత్ర చేయాలని ఉందని తెలిపారు. పాదయాత్ర చేసే శక్తి తన‌కు ఉందని అన్నారు. విద్యార్థులు అడిగే అన్ని ప్ర‌శ్న‌ల‌కి ఇప్పుడు స‌మాధానం చెప్ప‌లేనని పేర్కొన్నారు. అనంత‌పురంలోని క‌ర‌వు ప్రాంతాల్లో పాద‌యాత్ర చేస్తాన‌ని వెల్ల‌డించారు. అక్క‌డి క‌ర‌వు ప‌రిస్థితుల‌పై అధ్య‌య‌నం చేస్తాన‌ని, ఆ తరువాత అన్ని అంశాల‌ను స‌మ‌గ్రంగా చ‌ర్చించి పోరాడ‌తాన‌ని చెప్పారు. ఆరోజు మీరు అడిగిన అన్నింటికి సమాధానం చెబుతానని తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  janasena  Face to Face  Gutti Engineering College  

Other Articles