డొనాల్ట్ ట్రంప్ భయం ఏ రేంజ్ లో అంటే.. | satires on celebs who tweet on Trump in past

After presidential victory trump supports revenge tweets

Trump against tweets, Canada’s Immigration Site, Trump against tweets, celebs tweets on Trump, Hollywood tweets on trump

Americans Really Did Crash Canada’s Immigration Site as Donald Trump Won.satires on celebs who tweet on Trump in past

డొనాల్డ్ ట్రంప్.. భయం..భయం...

Posted: 11/11/2016 10:23 AM IST
After presidential victory trump supports revenge tweets

డొనాల్ట్ ట్రంప్ గెలుపు ప్రపంచంలో చాలా మందికి ఇప్పటికీ ఊహించలేని షాక్ గా ఉండిపోయింది. మేధావులతోసహా చాలా మంది దీనిపై ఇప్పటికీ విశ్లేషణలు చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఆయన ప్రెసిడెంట్ గా చచ్చినా గెలవడంటూ, ఒకవేళ గెలిస్తే తాము దేశం విడిచి వెళ్తామంటూ కొందరు ధీమాగా అప్పట్లో ట్వీట్ చేశారు. ముఖ్యంగా మహిళల మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో కాడన్న ధైర్యంతో ఆ కామెంట్లు చేశారులేండి. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.

ఛాన్స్ వచ్చింది కదా అందుకే ఇప్పుడు ట్రంప్‌ మద్దతుదారులంతా వారిని గేలి చేస్తు ట్వీట్లు వేస్తున్నారు. అలా అన్న హాలీవుడ్‌ స్టార్ల జాబితా చూస్తే..

లెనా డన్హమ్‌: కెనడాలోని వాంకోవర్‌ వెళ్లిపోతానంది. ఇంకేం తట్టాబుట్టా సర్దుకో అమ్మా అంటూ ట్వీట్లు పడుతున్నాయి.

శామ్యూల్‌ ఎల్‌ జాక్సన్‌: జురాసిక్‌ పార్క్‌(1993), స్టార్‌వార్స్‌ ట్రయాలజీ లాంటి సూపర్‌హిట్‌ హాలీవుడ్‌ చిత్రాల్లో నటించిన శామ్యూల్‌.. ట్రంప్‌ గెలిస్తే తాను దక్షిణాఫ్రికాకు వెళ్లిపోతానని కాస్తంత ఘాటుగానే ప్రకటించాడు. ఇప్పుడేం అంతా జోక్ అంటున్నాడు.

మిలీ సైరస్‌: ఎక్కడికి వెళ్లిపోతుందో చెప్పలేదుగానీ.. ట్రంప్‌ గెలిస్తే దేశం విడిచి వెళ్తానని మాత్రం చెప్పిందీ ప్రముఖ గాయని, నటి.

చెర్‌: అమెరికాలో ఈవిడని గాడ్డెస్‌ ఆప్‌ పాప్‌ (అనగా పాప్‌ దేవత)గా వ్యవహరిస్తారు. రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక కాకముందే ట్రంప్‌తో ఈవిడకు గొడవలున్నాయి. ఈవిడైతే ఏకంగా ట్రంప్‌ గెలిస్తే గురు గ్రహానికి వెళ్లిపోతానని ట్వీట్‌ చేసిది! మరో సందర్భంలో.. తాను కెనడాకు వెళ్లడానికి టికెట్‌ కూడా కొనేసుకున్నానని ఒట్టేసింది. మరిప్పుడు వెళ్లడానికి సిద్ధమా అని ట్రంప్‌ మద్దతుదారులు ఎద్దేవా చేస్తున్నారు.

నటాషా ల్యోన్‌: మరో అందాల నటి నటాషాల్యోన్‌ అయితే.. ట్రంప్‌ గెలిస్తే తనంత తాను నేరుగా మానసిక చికిత్సాలయానికి వెళ్లి అక్కడ చేరుతానని చెప్పింది.

జార్జ్‌ లోపెజ్‌: అమెరికన్‌ కమెడియన్‌, నటుడు. ట్రంప్‌ గెలిస్తే దేశ దక్షిణ సరిహద్దులకు (లాటిన్‌ అమెరికా దేశాలకు) వెళ్లిపోతామన్నాడు. ఇప్పటికే టికెట్‌ కూడా బుక్‌ చేసేసుకున్నా.. అని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రకటించాడు.

ఇంకా.. నెవి క్యాంప్‌బెల్‌ అనే కెనడియన్‌ నటి ఏదో ఒక చోటుకు వెళ్తానని, చెల్సియా హ్యాండ్లర్‌ అనే నటి స్పెయిన్‌కి వెళ్తానని.. ఇప్పటికే అక్కడో ఇల్లు కొనుక్కున్నానని, బార్బరా స్టెరిశాండ్‌ అనే నటి.. ఆస్ట్రే‌లియాకో కెనడాకో.. ఏదో ఒక ఓడ ఎక్కేస్తానని, బ్రయాన్‌ క్రాన్‌స్టన్‌ అనే నటుడు, అల్‌ షార్ప్‌టన్‌ అనే పౌర హక్కుల కార్యకర్త దేశం విడిచి వెళ్తానని చెప్పారు.

మరోపక్క ట్రంప్ ప్రెసిడెంట్ గా గెలిచిన తర్వాత యువతీయువకులు భయాందోళనలు నెలకొన్నాయి. ఉద్యోగాలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నేపధ్యంలో తాము కెనడా పారిపోడం మినహా మరో దారి లేదంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు ట్రంప్ గెలిచాక కెనడా పారిపోతున్నామంటూ అమెరికన్ యువతీయువకులు కొందరు ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు.

అంతేందుకు బుధవారం ట్రంప్ విజయం దిశగా దూసుకుపోతున్నప్పుడు చాలామంది ట్రంప్ టోర్నడో అని నినాదాన్ని జోడించడం మొదలుపెట్టారు. అంతేకాదు ఆ సమయంలోనే కెనడా ప్రధాన ఇమ్మిగ్రేషన్ సైట్‌ను భారీగా వీక్షించినట్లు తెలుస్తోంది. అక్కడికి వెళ్లిపోయేందుకు తట్టాబుట్టా సర్దుకున్నట్లు అవగతమవుతోంది. ఇమ్మిగ్రేషన్ సైటును విపరీతంగా ఆశ్రచంటంతో సర్వర్ లోడ్ ఎక్కువై అది కాస్తా క్రాష్ అయినట్లు వార్తలు కూడా వచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donald Trump  Celebrities  Tweets  

Other Articles