ఏటీఎం కార్డులు.. వాడుకున్నోడికి వాడుకున్నంత | No Fee For Using Another Bank's ATM

No fee for using another bank s atm

New Currency notes, ATM centers Rush, No ATM surcharge, Another bank ATM, Relief for ATM holders, Bank ATM, New currency in ATM, old currency motes ATM, ATM card no limit, ATM withdrawal limits

No Fee For Using Another Bank's ATM, Amid Rush For New Notes.

ఏటీఎంల వాడకంపై కొత్త నిబంధన

Posted: 11/11/2016 09:43 AM IST
No fee for using another bank s atm

రోజంతా బ్యాంకుల్లో పాత నోట్లు మార్చటం, డిపాజిట్లు చేయటంతోనే దేశ ప్రజలంతా గడిపేశారు. 500, 1000 పెద్ద నోట్ల బ్యాన్ ఏమోగానీ, రెండు రోజులుగా చేతిలో రూపాయి లేకుండా గడిపేశారు. అందరికీ ఊరట కలిగిస్తూ ఈ రోజు ఏటీఎంలు తెరుచుకోబుతున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉదయం 9 దాటినా ఇంకా అవి ఓపెన్ కాలేదు.

నిన్నంతా బ్యాంకు లోనే బిజీగా ఉన్న సిబ్భంది, కొత్త కరెన్సీని నింపే పనులు పూర్తి కాకపోవడం, నింపిన వాటిల్లో సాఫ్ట్ వేర్ అప్ డేట్ కాకపోవడం వంటి కారణాలతో మరి కాస్త ఆలస్యం అవొచ్చని బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే ఏటీఎంల దగ్గర క్యూ భారీగా ఉండొచ్చన్న అంచనాకు వచ్చిన కేంద్రం ప్రజల కోసం మరో గుడ్ న్యూస్ ప్రకటించింది.

కొత్త నోట్ల కోసం క్యూ కట్టే జనాలకు వెసులుబాటు కల్పిస్తూ ఏటీఎం సర్ ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. రోజుకు డిపాజిట్ కు లిమిట్ లేనప్పటికీ, గరిష్టంగా 2 వేలు, ఆపై 4 వేలు మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం మాత్రమే ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో నెలలో ఎక్కువ రోజులు ఏటీఎంను ఆశ్రయించాల్సి ఉంటుంది. అందుకే గరిష్టంగా ఐదు విత్ డ్రాయల్ పరిమితి నిబంధనను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మరోపక్క 2 లక్షల 50 వేల పరిమితి కంటే ఎక్కువ లావాదేవీలకు టాక్స్ విధించనున్న ప్రభుత్వం, అందులో అవకతవకలు గమనిస్తే మాత్రం 200 శాతం పెనాల్టీ విధించనున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ATM card  withdrawal limits  New Currency Notes  

Other Articles