బ్లాక్ మనీ కోసం భలే భలే ఐడియాలు | Black money holders new ideas for change currency.

New currency not effect on black money

Black Money India, New Currency Notes, New Currency Black Money, new Notes not effect, PM Modi Black Money Holders, Black to White Money, How to change black money to white

Modi's New Currency idea not effect on Black money holders. they convert money into white with new ideas.

బ్లాక్ టూ వైట్ గూగుల్ లో వెతికేస్తున్నారంట!

Posted: 11/11/2016 08:31 AM IST
New currency not effect on black money

పెద్ద నోట్లను ఒక్కసారిగా రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లను ప్రవేశపెట్టడం ద్వారా నల్ల డబ్బు కాస్త బూడిదైపోతుందన్న మోదీ ఆలోచనకు అంతర్జాతీయ మీడియా సైతం ప్రశంసలు కురిపిస్తోంది. వాట్ ఆన్ ఐడియా మోదీ జీ అంటూ పాక్ తప్ప పొరుగున ఉన్న దేశాలు కూడా ప్రశంసలు కురిపించి, వాళ్లు కూడా ఫాలో అయ్యేందుకు సిద్ధమైపోతున్నారు. ఓవైపు సామాన్య జనాలు కాస్త కష్టాలు ఎదుర్కుంటున్నప్పటకీ, మరో మూడు నాలుగు రోజుల్లో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. నకిలీ కరెన్సీ మాఫియాకు కోలుకోలేని షాక్ ఇచ్చిన మోదీ సర్జికల్ స్ట్రైక్, మరి బ్లాక్ బాబులపై ఏ మేర ప్రభావం చూపుతోంది.

ఇప్పటికే టాక్స్ ఎగవేతకు ఫ్లాన్ వేసిన చాలా మంది బడాబాబులు పోతేపోనీ అనుకుంటూ తమ డబ్బును బ్యాంకుల్లోనే జమచేసేందుకు ఆసక్తి చూపుతున్నారంట. అయితే కొందరు మాత్రం తెలివితేటలు ప్రదర్శిస్తూ బ్లాక్ టూ వైట్ కి భారీగానే పావులు కదుపుతున్నారు. పెద్ద నోట్ల రద్దు.. బ్యాంకుల మూసివేత.. ఏటీఎంల బంద్‌.. కొన్ని రోజుల వరకు నిర్ణీత స్థాయిలోనే నగదు లావాదేవీలు నిర్వహించాలన్న ఆంక్షల నేపథ్యంలో వాటిని అధికారికంగా మార్చేందుకు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాయి.

అక్రమంగా సంపాదించి.. రహస్యంగా దాచిన డబ్బును ఇతరుల బ్యాంకు ఖాతాల నుంచి తమ ఖాతాలోకి మళ్లించుకోవడమే బ్లాక్‌ మనీని వైట్‌గా మార్చడం. ఇది నిరంతర ప్రక్రియ. కొన్ని వ్యాపార సంస్థలు.. నల్లధనాన్ని వైట్‌గా మార్చి కమీషన్‌ తీసుకుంటుంటాయి. నల్లధనాన్ని మార్చేందుకు ఎప్పుడూ సరికొత్త మార్గాలను కనుగొనే అక్రమార్కులు.. పాత నోట్ల చిక్కుతో ఈసారీ అదే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు గూగుల్ లో వెతికేస్తుండగా, మరికొందరు వ్యాపార సంస్థలను, కింది స్థాయి సిబ్బందిని విపరీతంగా వాడేసుకుంటున్నారు.

రూ.2.5 లక్షలు దాటిన ప్రతి లావాదేవీపైనా ఆదాయపు పన్ను శాఖ నిఘా ఉంటుందన్న ప్రచారం నేపథ్యంలో కొన్ని సంస్థలు మార్పిడికి ముందుకు రావడం లేదు. ఇబ్బందుల నేపథ్యంలో తక్కువ మొత్తమైనా.. ఉద్యోగులు, ఇతర సామాన్యుల ద్వారా పని పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాయి కంపెనీలు. ఇళ్లలో పనిచేసే కార్మికుల నుంచి కారు డ్రైవర్లు, కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల వరకూ అందరినీ వాడేసుకుంటున్నారు. నమ్మకంగా ఉండే ఉద్యోగులకు నగదు ఇచ్చి.. ఖాతాల్లో వేసుకోమని సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌ లావాదేవీలు కొనసాగించాలని భావిస్తున్నాయి. సిబ్బందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయా? లేవా? అన్న ఆరాలు తీసి మరీ వారి ఖాతాలో డబ్బులు వేయాలని సూచిస్తూ పెద్ద మొత్తంలోనే కమీషన్ ఆఫర్ చేస్తున్నాయి.

మరికొందరు పెద్ద మొత్తంలోనే వాటా ఇస్తామంటూ నమ్మకస్తులకు నగదు ఇచ్చి.. బ్యాంకు ఖాతాల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. ఇవే గాక సొమ్ము ఖాతాలోకి వేసుకున్న తర్వాత ఆన్ లైన్ కి పరిమితి లేకపోవటంతో ట్రాన్స్ ఫర్ చేయాలని సూచిస్తున్నారు. ఇదే బాటలో పయనించేందుకు కొందరు నల్ల బాబులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. మరికొన్ని సంస్థలు అయితే ఉద్యోగులకు అకౌంట్లో కాకుండా, క్యాష్ రూపంలోనే నేరుగా జీతాలను ఇచ్చేయటం కొసమెరుపు. గుట్టుగా దాచిన కోట్లాది రూపాయల నోట్ల కట్టలను బయటకు తీసే ప్రయత్నంలో చేస్తున్నాయి బడా కంపెనీలు ఉండగా, ఐటీ శాఖ ఓ కన్నేసి ఉంచాలంటూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  New Currency Concept  Black Money Holders  

Other Articles