కేసీఆర్ ను ఢిల్లీ సుల్తాన్ తో పోల్చిన డీకే అరుణ!!! | DK Aruna compares KCR with Tughlaq.

Dk aruna fire on kcr over new secretariat

Congress MLA DK Aruna, Gadwal MLA DK Aruna, DK Aruna KCR, TRS DK Aruna, DK Aruna TRS, DK Aruna New Secretariat, Telangana new secretariat

Congress senior leader DK Aruna fire on KCR over new secretariat.

కాబోయే హోంమినిస్టర్ ‘తుగ్లక్’ అనేసిందేంటి?

Posted: 11/11/2016 08:03 AM IST
Dk aruna fire on kcr over new secretariat

రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం సర్వసాధారణ విషయం. ఒక్కోసారి అవి ఊహించని రీతిలో ఉంటాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ తర్వాత పాలనలో కూడా కేసీఆర్ ను టార్గెట్ చేసి ఘాటైన విమర్శలు గుప్పించిన టీడీపీ నేతలు, ఇప్పుడు గులాబీ కండువాలు కప్పుకుని దర్జాగా తిరిగేస్తున్నారు. అదనంగా వారికి కీలక బాధ్యతలు బోనస్ గా వస్తున్నాయి కూడా.

ఈ దశలో త్వరలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబుతున్నారంటూ కాంగ్రెస్ నేత, గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కొత్త జిల్లా ఏర్పాటుకు సుముఖత, ఆపై జిల్లా ఆవిర్భావం సందర్భంగా టీఆర్ఎస్ నేతలతో కలివిడిగా మాట్లాడటం తదితర పరిణామాలు పరిశీలించిన మీడియా హోంమంత్రి పదవి కండిషన్ తో ఆమె కారెక్కే విషయాలను కన్ఫర్మ్ చేశాయి. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లో అధికార పక్షం లో చేరబోననే సంకేతాలను ఆమె ఇప్పటికే పరోక్షంగా అందించారు కూడా. ఈ దశలో నిన్న ఆమె చేసిన వ్యాఖ్యలు దానిని ధృవపరుస్తున్నాయి.

తెలంగాణ సచివాలయాన్ని కూల్చేసి, దాని స్థానే కొత్త కట్టడం కోసం కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఓవైపు కోర్టులో దీనిపై కేసు నడుస్తుండగానే, శంకుస్థాపన పనులు ప్రారంభించాలని అల్రెడీ డిసైడ్ అయ్యారు కూడా. దీంతో నిన్న కాంగ్రెస్ కీలకనేతలంతా సచివాలయం దగ్గర రోడ్డుపై బైఠాయించటంతో వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ.. కేసీఆర్ ది ముమ్మాటికి తుగ్లక్ చర్య అంటూ వ్యాఖ్యానించింది. ‘‘ఎవడి సొమ్మనుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నావని, దుర్వినియోగం చేసే హక్కు ఎవరిచ్చారంటూ పరుషమైన పదజాలంతో టీ సీఎంను నిలదీసింది.

సచివాలయాన్ని కూల్చాలంటే ముందు ప్రజాతీర్పు కోరాలన్న ఆమె, అల్లుడు హరీశ్ సీఎం అవుతాడనే భయం కేసీఆర్‌ను వెంటాడుతోందని చెప్పుకొచ్చింది. మిషన్ భగీరథలో నీళ్ళు పారడం దేవుడెరుగు, కేసీఆర్ ఇంటికి వేల కోట్లు పారుతున్నాయని విమర్శించింది. కేసీఆర్‌ను పాతరేసే రోజులు దగ్గర పడ్డాయంటూ వ్యాఖ్యలు చేస్తూ హెచ్చరికలు జారీ చేసిన అరుణ పార్టీ మారటం లేదంటూ చెప్పేసినట్లే కదా!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress MLA  DK Aruna  Telangana CM  KCR  New Secretariat  

Other Articles