పవన్ కల్యాన్ వర్సెస్ బాలయ్య @ అనంతపురం.. does Pawan Kalyan targets bala krishna by choosing Anantapur.?

Does pawan kalyan targets bala krishna by choosing anantapur

Jana Sena Party, Pawan Kalyan, Bala Krishna, Special Category Status to Andhra Pradesh,​ AP special status, Andhra pradesh special status, Ap political news, JSP, TDP., BJP, power star pawan kalyan, PK janasena, janasena ananthapur

Jana Sena Party supremo Pawan Kalyan targets bala krishna and tdp party by choosing anantapur as his place to contest in elections.

పవన్ కల్యాన్ వర్సెస్ బాలయ్య @ అనంతపురం..

Posted: 11/10/2016 06:12 PM IST
Does pawan kalyan targets bala krishna by choosing anantapur

అనంతపురం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వున్న అతిపెద్ద జిల్లా. ఇప్పటి వరకు కరువు కాటకాలకు, ఫ్యాక్షన్ రాజకీయాలకు ఖిల్లాగా మారిన ఈ జిల్లా.. ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలకు కేరాఫ్ గా మారుతుందా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. ఒక్కసారిగా అనంతపురం జిల్లా ఇలా రాజకీయాలలో కేంద్రబిందువుగా మారడానికి కారణం ఏమిటీ..? అంటే జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ అని చెప్పక తప్పుదు.

ఇవాళ అనంతపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో సీమాంధ్ర హ‌క్కుల చైత‌న్య సభలో ఆయ‌న మాట్లాడుతూ... రానున్న ఎన్నికలలో తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. గెలుస్తామా లేదా... అన్న విషయాన్ని తాను పట్టించుకోనన్నారు. అయితే హోదా కోసం.. జిల్లాలోని కరువును పారద్రోలేందుకు తనకు ఓటువేయాలని కోరారు. ప్రజలు ఓట్లు వేసినా.. వెయ్యక పోయినా తాను జిల్లా వెనకబాటును పొగెట్టేందుకు తప్పక ప్రయత్నిస్తానని చెప్పారు.

ఈ నేపథ్యంలో పవన్ కల్యాన్ అనంతపురాన్ని ఎన్నుకునేందుకు గల కారణాలను విశ్లేషిస్తే.. అనంతపురం జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మరో సినీనటుడు బాలకృష్ణను టార్గెట్ చేశారా..? అన్న సందేహాలు కలుగుతున్నాయి. అనంతపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పి.. దాని ప్రభావం జిల్లా వ్యాప్తంగా వుండేందుకు ప్రణాళికతోనే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారా..? అంటే కూడా అవుననే సమాధానాలే వినబడుతున్నాయి.

రాయలసీమ ప్రాంతంలో టీడీపీకి పట్టున్న జిల్లా అనంతపురమే. ఈ జిల్లా నుంచి తాను పోటీ చేసి.. అటు పార్టీని, ఇటు బాలయ్యను ప్రత్యేక హోదా విషయంతో పాటు అటు అనంత కరుపు అంశంలోనూ టార్గెట్ చేస్తున్నారా..? అని అనుమానాలు రేకెత్తుతున్నాయి. గత ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీడీపీ విఫలమైందని, దీనికి తోడు అవినీతి కూడా పెరిగిందని విమర్శలు వెస్తున్నాయని.. ఈ విషయంలో టీడీపీ అత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన సూచించడం కూడా వారి తప్పులను ఎత్తిచూపడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక అటు ప్రజలకిచ్చిన హామీలను మర్చిపోతే.. ఎలాంటి ఉద్యమానికైనా, పోరాటానికైనా మేము సిద్దం అని కూడా టీడీపీ నేతలకు ఆయన సూచనలు చేశారా..? లేక ఈ విషయంలో ముగిసిన అద్యాయమని చెబుతున్న నేతలపై రాజకీయ అధ్యాయాన్ని ప్రారంభిస్తామని చెప్పడం వెనుక అంతరార్థం స్పష్టంగా వెల్లడైందని రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  jana sena  bala krishna  anathapur  JSP  TDP  BJP  Congress  

Other Articles