చిల్లర బతుకులు: వంద ఇస్తే వందనోట్లు సప్లై | currency exchange gangs into field

Currency exchange gangs into field

currency exchange gangs, New Notes in India, 100 Rupees King maker, Cash Exchange gangs Danda, note exchange gangs, Hyderabad Currency Exchange Mafia

After ban on 500 and Thousand notes Currency Exchange gangs enter into scene and supply money on commission base.

చిల్లర కింగులు రంగంలోకి దిగేశారు

Posted: 11/09/2016 12:39 PM IST
Currency exchange gangs into field

ఒక్క రాత్రి కొన్ని కోట్ల జీవితాలను కకావికలం చేసేస్తోంది. నిన్న సాయంత్రం దాకా మురిపెంగా దాచుకున్న పెద్ద నోట్లు కాస్త చెల్లని చిత్తు కాగితాలుగా మారిపోతున్న క్రమంలో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలోకి సామాన్యుడు చేరుకున్నాడు. రెండు, మూడు రోజుల్లో పరిస్థితి మాములుగా మారుతుందని ప్రభుత్వం ధైర్యం చెబుతున్నప్పటికీ, ప్రస్తుతం చేతిలో చిల్లర ఉన్నోడే కింగ్.

ఇక దేన్ని వదలని మన దేశంలో దీనిని మాత్రం ఎందుకు వదులుతారు. అందుకే దళారులు రంగంలోకి దిగిపోయారు. 500, 1000 రూపాయ‌ల నోట్లు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోతుండటంతో సామాన్యుల్లో తీవ్ర ఆందోళ‌న నెల‌కొంది. ముఖ్యంగా భాగ్యనగర వాసులు పెద్ద నోట్ల‌ను ప‌ట్ట‌కుని ద‌ళారుల వ‌ద్ద‌కు క్యూ క‌డుతున్నారు. వారి అమాయకత్వం ఎంతలా ఉందంటే... సెలవు అని చెబుతున్నా వినకుండా న‌గ‌రంలోని సెక్ర‌టేరియ‌ల్ రోడ్డు వ‌ద్ద ఉన్న ఆర్‌బీఐ శాఖ ముందు పడిగాపులు కాస్తున్నారు.

అక్కడ సీన్లు ఎలా ఉన్నాయంటే... ఓ చెట్టు కింద‌ పాత నోట్ల మార్పిడి దందా కొన‌సాగుతోంది. చిల్ల‌ర‌ను బ్యాగులో తీసుకొచ్చిన ద‌ళారులు రూ.500కి 100 రూపాయ‌ల క‌మీష‌న్‌తో చిల్ల‌ర ఇస్తున్నారు. వంద‌, యాభై రూపాయ‌ల నోట్ల‌తో పాటు రూపాయి, రెండు రూపాయ‌లు, ఐదు రూపాయ‌ల కాయిన్‌లు కూడా ఇస్తూ మీడియాకు క‌ంటపడ్డారంట. ఛాన్సు దొరికిందని కమీషన్ పేరిట 20 శాతం తీసేసుకుని అంటే 500 కి వంద తీసుకుని, నాలుగు వందలు ఇస్తున్నారంట.

jokes on old Indian notes

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఇదే తంతు. 10 నుంచి 30 శాతం దాకా కమిషన్ తీసుకుని చిల్లర అందిస్తున్నారు. ఇంకోపక్క కొన్ని ఏటీఎం సెంటర్ల బయట ఈ సీన్ దర్శనమివ్వటం విశేషం. మెడిక‌ల్ షాప్‌లు, రైల్ టిక్కెట్లు వంటి మినహాయిస్తే వ్యాపారస్థులు ఐదొందలు, వెయ్యి నోట్లు తీసుకునేందుకు నిరాకరించటంతోనే ఈ పరిస్థితి నెలకొందని కొందరు వాపోతున్నారు.

అయితే, నోట్ల మార్పిడి అంశంపై దయచేసి అవ‌గాహ‌న లేమితో వ్యవహరించకండి అంటూ ప్రజలకు ఆర్బీఐ విజ్నప్తి చేస్తోంది. సామాన్యులు తమ వ‌ద్ద ఉన్న పెద్ద‌ నోట్ల‌పై ఆందోళ‌న చెంద‌కూడ‌ద‌ని, వారి డ‌బ్బుకి ఎటువంటి ఇబ్బంది ఉండ‌ద‌ని, రేప‌టి నుంచి బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవ‌చ్చ‌ని సూచిస్తోంది. మరోవైపు పూర్తి సమాచారం కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ వెబ్ సైట్ ను ఆశ్రయిస్తున్న వారికి నిరాశే ఎదువుతోంది. భారీ సంఖ్యలో ప్రజలు ఆర్బీఐ వెబ్ సైట్ ను ఆశ్రయించటంతో సర్వర్ సేవలు నిలిచిపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Currency exchange gangs  

Other Articles